KCR: చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

KCR: ఆంధ్రప్రదేశ్ లో పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివావరం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ సింగిల్ గానే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదని.. ఒక్కో కార్యకర్త ఒక్కో కేసీఆర్‌లాగా తయారవ్వాలన్నారు. మోడీ మెడపై కత్తి పెట్టినా తాను రాష్ట్రం కోసం వెనకడుగు వేయలేదన్నారు. ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు.

బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వస్తాయని.. అలాగే సిరిసంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారన్నారు. పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఇప్పుడు సమస్యం వలయంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

KCR s Sensational Comments on Chandrababu Naidu

తెలంగాణను ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని.. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నోటీకి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని.. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో పెట్టని హామీలు కూడా నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ దేనని కేసీఆర్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పెట్టకున్నా రైతుబంధు, కల్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అంటూ కేసీఆర్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+