ఏపీ ఆధార్ కార్డున్నా తెలంగాణాలో వారికి ఉచిత బస్సు ప్రయాణ పథకం!

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమలు అవుతుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఉచిత బస్సులలో ప్రయాణం చేస్తున్న మహిళల యొక్క సమస్యలను గుర్తిస్తోంది. ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. తెలంగాణలో ఉంటున్న చాలా మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందలేకపోతున్నారు.

వారికి శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం
కారణం వారు తెలంగాణలో ఉంటున్నప్పటికీ వారి ఆధార్ కార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి కావడంతో వారికి ఉచిత బస్సు ప్రయాణం అమలు కావడం లేదు. వీరందరిని ఏపీకి చెందిన వారిగా గుర్తిస్తూ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం లేదు ఆర్టీసీ కండక్టర్లు. అయితే ఈ విషయం గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వారికి కూడా శుభవార్త చెప్పింది.

Key announcement on free bus travel scheme

ఆధార్ కార్డులో ఏపీ ఉన్నా, ఆ ప్రూఫ్ లతో ఉచిత బస్సు సౌకర్యం
ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నప్పటికీ, కేవలం ఆధార్ కార్డు మాత్రమే కాకుండా తెలంగాణలో వారు నివసిస్తున్నట్లుగా ప్రూఫ్ చూపించడం కోసం మరే ఇతర ఐడి కార్డు చూపించినా వారికి కూడా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం సూచించింది.

లోకల్ అడ్రస్ తో ఉండే కార్డు చూపిస్తే వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం
రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఇలా ఏదైనా లోకల్ అడ్రస్ తో ఉండే కార్డు చూపిస్తే వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం లభిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఈడి రాజశేఖర్ స్పష్టం చేశారు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డులు తీసుకున్నవారు, తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఆధార్ కార్డులలో మార్పు చేసుకోలేదు.

ఏపీ అని అడ్రెస్ లో ఉన్న వారికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ నిర్ణయం
కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాళ్ళు తెలంగాణలో నివాసం ఉంటున్న క్రమంలో వారు ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ ను మార్చుకోలేదు. దీంతో ప్రస్తుతం ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉండడం మహిళలు ఉచితబస్సు ప్రయాణ సౌకర్యానికి అడ్డంకిగా మారింది. ఈ క్రమంలోని దీనికి చెక్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం లోకల్ అడ్రస్ ఉన్న ఏదైనా కార్డును ఆర్టీసీ కండక్టర్లకు చూపించి జీరో టికెట్ మీద ప్రయాణం చేయాలని సూచిస్తోంది.

ఉచిత బస్సు సౌకర్యంపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్
ఒకవేళ కండక్టర్లు జీరో టికెట్ ఇవ్వడం కుదరదు అంటే టోల్ ఫ్రీ నెంబర్ 04069440000 నెంబర్ కు కాల్ చేసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంలో తమకు కలుగుతున్న సౌకర్యం పైన ఫిర్యాదు చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం తెలంగాణలో నివాసం ఉండేవారు, ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉన్నప్పటికీ, ఇక్కడే నివాసం ఉంటున్నట్టు ఏదైనా ప్రూఫ్ తీసుకువెళ్లి ఉచిత బస్సుల్లో ఎంచక్కా ప్రయాణం చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+