ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామం; కవిత బంధువుల ఇళ్ళలో ఈడీ సోదాలు!!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడి అధికారులు, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో తనిఖీలు చేస్తున్నారు. కవిత బంధువుల ఇళ్ళలో ఇప్పుడు సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ కనిపిస్తుంది.

ఈ రోజు ఉదయం నుండి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మాదాపూర్ లోని కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కవిత కాల్ డేటా ఆధారంగా కవిత భర్త అనీల్ సోదరి అఖిల ఇంట్లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే కవితను ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

Key development in Delhi liquor scam ED searches in the houses of Kavitha relatives

నేడు మధ్యాహ్నం 12 గంటలకు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు. అయితే కవిత కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది. ఇక మరోవైపు కవితతో పాటు కవిత పీఏను, కవిత దగ్గర పని చేసే సిబ్బందిని ఈడీ అధికారులు విచారించారు. అన్ని ఆధారాలను ముందుంచి కవితను ఈడీ అధికారులు విచారణ జరిపినట్టు సమాచారం.

ఇక ఈ కేసులో నేడు కోర్టు ముందుకు కవిత మరోమారు వెళ్తున్న క్రమంలో మళ్ళీ ఆమె కస్టడీ పొడిగిస్తారా? లేకా ఆమెను రిమాండ్ పై జైలుకు తరలిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ కేసులో దూకుడు పెంచిన ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం కోర్టు అనుమతితో విచారణ సాగిస్తున్నారు.

కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఈడీ దర్యాప్తులో ఏం చెప్తారు అన్నది ఆసక్తిని కలిగిస్తుంది. ఈ క్రమంలో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇంకా ఈడీ దాడులు కొనసాగుతున్న క్రమంలో, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఏం జరగబోతుంది అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+