MLAs Defection Case: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం
MLAs Defection Case: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో ఈ నెల 22లోగా స్పందించాలని ఇచ్చిన నోటీసులపై స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై ఈ నెల 25న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గతంలో ప్రభుత్వానికి, అసెంబ్లీ కార్యదర్శికి, 10 మంది ఎమ్మెల్యేలకు, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 22 లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులు పంపించగా.. నిర్ణీత గడువు ముగియడం వల్ల కోర్టు మరోసారి నోటీసులను జారి చేసింది.
తెలంగాణలో ఇటీవల చోటుచేసుకున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది కాంగ్రెస్ లో చేరారు. ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు సమయం ఇవ్వాలన కాంగ్రెస్ కోరుతుండగా.. ఈ కేసుపై న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తామని బీజేపీ స్పష్టం చేసింది. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో తుది నిర్ణయం ఎలా వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే.. రాష్ట్రంలో ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications