ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీసీఎస్ శాంతికుమారి స్టేట్మెంట్ రికార్డ్!

ఫోన్ టాపింగ్ కేసు రోజుకో కొత్త కీలక మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జిఏడి ప్రిన్సిపల్ సెక్రెటరీ { పొలిటికల్) రఘునందన్ రావులను విచారణకు పిలిచి స్టేట్మెంట్లను నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు నేతృత్వంలోని ఎస్ఐబి విభాగం సుమారు 618 ఫోన్ నెంబర్లను ఫోన్ టాపింగ్ చేయడం కోసం రివ్యూ కమిటీకి సమర్పించింది.

శాంతికుమారి, రఘునందన్ రావుల స్టేట్మెంట్స్ రికార్డ్
అప్పట్లో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతి కుమారి DOTకి ఆ లిస్టును పంపి టెలికం అనుమతులు తీసుకున్నట్టు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులు శాంతికుమారి, రఘునందన్ రావులను స్వయంగా విచారించి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో అప్పటి హోంశాఖ కార్యదర్శి ప్రస్తుత డిజిపి జితేందర్ మరియు ఇంటిలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ లకు ప్రశ్నలతో కూడిన నోటీసులు జారీ చేశారు.

Key development in the phone tapping case Former CS Shanthikumari statement recorded

Take a Poll

లోతుగా సిట్ విచారణ
సిట్ అధికారులు కేసును మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇక తాజాగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జి ఏ డి ప్రిన్సిపల్ సెక్రెటరీ (పొలిటికల్) రఘునందన్ రావుల స్టేట్మెంట్లు రికార్డు చేయడంతో వీరిద్దరూ సిట్ అధికారుల ముందు ఏం చెప్పారు అన్నది ప్రస్తుతం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. అయితే శాంతి కుమారి ఎస్ఐబి రివ్యూ కమిటీ ప్యానెల్ ను తప్పుదోవ పట్టించిందని వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాప్
ఇదిలా ఉంటే ఈ కేసులో ఎన్నికల సమయంలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీలో ఉన్న సమయంలో ఫోన్ టాపింగ్ జరిగినట్టు సిట్ బృందం గుర్తించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి తదితరుల ఫోన్లు టాప్ అయినట్టు గుర్తించారు.

బాధితులను విచారిస్తున్న సిట్
దీంతో నేడు కాంగ్రెస్ నేత హరి వర్ధన్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ నేత బిల్లా సుధీర్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. రేపు బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి విచారణకు హాజరుకానున్నారు. రేపు ఈటల రాజేందర్ సాక్షిగా సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఇక ఫోన్ టాపింగ్ కేసులో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులను విచారిస్తున్నటువంటి సిట్ వారిస్తున్న వివరాలతో నిందితులను ప్రశ్నిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+