మారుతీరావు అంత్యక్రియలకు అమృత ? ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక విషయాలు

మారుతీరావు ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మారుతీరావు ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మారుతీరావు మృతి చెందిన తరువాత ఆయన శరీరం రంగు పూర్తిగా మారిపోవటంతో మారుతీరావు విషం తీసుకున్నారని ప్రిలిమినరీ రిపోర్ట్ లో బయటకు వచ్చింది. ఇక నేడు మారుతీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Recommended Video

    Amrutha Father Maruthi Rao's Priliminary Hospital Report Is Out,These Are The Key Points!
     మారుతీరావు శరీరం రంగు మారటానికి కారణం ఇదే

    మారుతీరావు శరీరం రంగు మారటానికి కారణం ఇదే

    ప్రణయ్ హత్యకేసు నిందితుడు అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చాతాప్తంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కూతురు అమృత స్పందిస్తే, పోలీసుల ఒత్తిడితో చనిపోయారని ఆయన భార్య ఆరోపించారు. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆయన సోదరుడు శ్రవణ్ చెప్పారు. హైదరాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్యకు పాల్పడిన మారుతీరావు శరీరంపైన ఎలాంటి గాయాలు లేవని, ఆయన శరీరం రంగు మారటానికి ఆయన విషం తీసుకోవటమే కారణం అని ప్రాధమికంగా పోస్ట్ మార్టం నివేదికలో తెలిసింది.

    గారెల్లో విషం కలుపుకుని తిన్న మారుతీరావు

    గారెల్లో విషం కలుపుకుని తిన్న మారుతీరావు

    కుమార్తె అమృత విషయంలో ఆవేదన , తీవ్ర మానసిక ఒత్తిడి, ఇక పోలీసుల నుండి ఉంటున్న ఒత్తిడి నేపధ్యంలోమారుతీరావు మృతి చెందారని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇక ఆయన సూసైడ్ నోట్ కూడా రాసి మరీ ప్రాణాలు విడిచారు. ఆయన మొన్న రాత్రి తిన్న గారెల్లో విషం కలుపుకుని తిన్నారని అందువల్లే ఆయన శరీరంలోని ఆర్గాన్స్ పని చెయ్యలేదని దాంతో ఆయన మృతి చెందారని ప్రిలిమినరీ నివేదికలో తేలింది. అయితే ఆయన తీసుకున్న పాయిజన్ ఏంటి అన్న కోణంలో ఇప్పుడు పరిశీలన జరుగుతుంది. మారుతీరావు మృత దేహం పూర్తిగా రంగు మారటానికి అదే కారణం అని పోస్ట్ మార్టం నివేదిక లో తెలిసింది.

    తనకు రక్షణ కల్పిస్తే తండ్రి అంత్యక్రియలకు వెళతానన్న అమృత

    తనకు రక్షణ కల్పిస్తే తండ్రి అంత్యక్రియలకు వెళతానన్న అమృత

    ఇక నేడు అంత్యక్రియలు జరగనున్న నేపధ్యంలో కుమార్తె అమృత తనకు రక్షణ కల్పిస్తే తండ్రి అంత్యక్రియలకు వెళ్తానని చెప్తున్నారు. ఇక తల్లి కుమార్తె అభ్యర్ధన విషయంలో మౌనంగా ఉన్నా అమృత బాబాయి శ్రవణ్ మాత్రం అమృత రావటానికి అంగీకరించటం లేదు. తన వల్లే ఇదంతా జరిగిందని ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన సోదరుడు కుమార్తె అమృత వల్లే మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. మరి ఈ నేపధ్యంలో అమృత అంత్యక్రియలకు వెళ్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+