ఉచిత కరెంట్ మీకు వర్తించటం లేదా? అయితే ఇలా చెయ్యండి!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గృహ జ్యోతి పథకం ద్వారా నిరుపేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తోంది. 2024 మార్చి నెలలో ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ ను అందిస్తోంది.

ఉచిత విద్యుత్ పథకం గురించి మీకు తెలుసా
ఈ పథకంలో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు జీరో కరెంట్ బిల్లును పొందుతున్నారు. అయితే ఉచిత కరెంట్ ప్రయోజనాన్ని పొందుతున్నవారు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. 200 యూనిట్లకు లోపు మాత్రమే వారి విద్యుత్ వినియోగం ఉంటే ఈ పథకం వర్తిస్తుంది. లేని పక్షంలో ఈ పథకం వర్తించదు. 200 యూనిట్లు దాటిన వారు కచ్చితంగా కరెంటు బిల్లు కట్టవలసి వస్తుంది.

key update how to get zero electricity bills in gruha jyothi Free electricity scheme

కోటిని దాటేయనున్న జీరో కరెంట్ బిల్లులు
కాబట్టి ఈ పథకాన్ని అందుకుంటున్న లబ్ధిదారులు 200 యూనిట్లను దాటకుండానే విద్యుత్ వినియోగం చేయాల్సి ఉంటుంది. ఇక డిసెంబర్ నెల లో జారీ చేసే మొత్తం విద్యుత్ బిల్లులతో కలిపి ఇప్పటివరకు జారీ చేసిన మొత్తం జీరో రేటెడ్ విద్యుత్ బిల్లులు ఒక కోటిని అధిగమించగలవని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య ప్రతినెల పెరుగుతూ వస్తుంది.

గ్రేటర్ హైదరాబాద్ ఉచిత విద్యుత్ లబ్దిదారులు
నవంబర్ నాటికి లబ్ధిదారుల సంఖ్య 20.71 శాతం పెరిగింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లోనే 10.52 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని 10 సర్కిల్స్ లో మొత్తం 50 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షల మేర పెరుగుతూ వస్తోంది.

బంజారా హిల్స్ లో అతితక్కువ లబ్దిదారులు
ప్రస్తుతం ఈ వినియోగదారులలో 20 శాతం మంది జీరో విద్యుత్ బిల్లులను అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ లో బంజారాహిల్స్ సర్కిల్లో అతి తక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ఉన్నారు. కేవలం 36వేల 657 మంది మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధిని పొందుతున్నారు.

పథకానికి అర్హత కావాలంటే ఇలా చెయ్యాల్సిందే
అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న అర్హత కలిగిన రెండు లక్షల మంది వినియోగదారులు 200 యూనిట్ల పరిమితిని మించిన కారణంగా ఈ నెలలో జీరో విద్యుత్ బిల్లును కోల్పోతున్నారు. ఇక అటువంటి వినియోగదారులు ఈ పథకానికి అర్హత సాధించాలంటే ఈ పథకంలో కొనసాగాలంటే కచ్చితంగా తమ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+