Ganesh chaturthi: గణేశ్ ఉత్సవాలకు ఖైరతాబాద్ మహా గణపతి సిద్ధం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..
ఆగస్టు 27 వినాయక చవితి సందర్భంగా ఊరు వాడా.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా గణేశ్ ఉత్సవాలకు సిద్ధం అవుతున్నారు. నగరాలు, పల్లెల్లో గణేశ్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. ముంబైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏటేటా గణేశ్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఇక పూజలకు ఖైరతాబాద్ బడా గణేశ్ సిద్ధం అయ్యాడు. విగ్రహ నిర్మాణంలోని చివరి దశలో భాగంగా కన్ను దిద్దడం తాజాగా పూర్తయింది. 69 అడుగులతో నిర్మించిన శ్రీ విశ్వ శాంతి మహాశక్తి గణపతి నేత్రాలను శిల్పి రాజేందర్ గీశారు.
ఖైరతాబాద్‌లో పూర్తయిన గణపతి విగ్రహం తయారీ.
— Icon News (@IconNews247) August 25, 2025
ఈరోజు ఉదయం నేత్రోత్సవం నిర్వహించిన కళాకారులు.
ఖైరతాబాద్ గణేష్ ఆగమాన్ కార్యక్రమం.
ఈ యేడాది 69 అడుగుల ఎత్తైన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం.
గణపతికి కుడి వైపున శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ మాత.
గణపతికి ఎడమ వైపున… pic.twitter.com/w6qACuzvZo
హైదరాబాదులోని ఖైరతాబాద్ లో ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా 11రోజులపాటు జరిగే ఖైరతాబాదు గణేశ్ ఉత్సవ మేళాలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ గణేశ్ నవరాత్రులు ఓ వేడుకలా నిర్వహిస్తారు. ఇక ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలకు ఖైరతాబాద్ మహా గణపతి సిద్ధం అయ్యాడు. విగ్రహ నిర్మాణంలో చివరి అంకమైన కన్ను దిద్దడం పూర్తి అయింది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో మహా గణపతి దర్శనమిస్తున్నాడు. దీంతో పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
#KhairatabadGanesh2025 is Ready..#KhairthabadGanesh#BadaGanesh#GaneshChaturthi2025 pic.twitter.com/BUdPJWPHt2
— SHRA.1 ✍ (@shravanreporter) August 25, 2025
ఖైరతాబాద్ గణేశుడిని దర్శనం చేసుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖైరతాబాద్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు సంత్ నిరంకారి జంక్షన్ వైపు మళ్లించారు. అలాగే ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ నుంచి రాజ్ దూత్ వైపు వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ నుంచి ఐ మ్యాక్స్ వైపు వచ్చే వాహనాలు సెక్రటేరియట్ మీదుగా తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లించారు. నెక్లెస్ రోడ్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు తెలుగుతల్లి జంక్షన్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా దారి మళ్లింపు చేశారు.

ఇక 2025 లో 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వ శాంతి మహాశక్తి గణపతిగా వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. స్వామి వారికి ఇరువైపులా కుడి పక్కన శ్రీజగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి వారు.. ఎడమవైపు లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి ఉండేలా విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. అలాగే గణేశ్ విగ్రహం 3 తలలతో నిల్చున్న భంగిమలో ఉంటుంది. తలపై పడగవిప్పిన 5 సర్పాలు, మొత్తం 8 చేతులు ఉంటాయి. కుడివైపు చేతుల్లో పైనుంచి ఆయుధం, సుదర్శన చక్రం, అభయహస్తం, రుద్రాక్షమాల ఉంటుంది.












Click it and Unblock the Notifications