హైదరాబాద్ కు ఖమేనీతో సంబంధం.. ఏకంగా ఆ పేరు మీద రోడ్డే!
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి చేసిన సంయుక్త దాడులలో ఇరాన్ సర్వ అధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణం ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా అందరిని షాక్ కి గురి చేసింది. 28వ తేదీ శనివారం ఉదయం డౌన్ టౌన్ లోని ఖమేనీ కాంపౌండ్ ను లక్ష్యంగా చేసుకుని జరిపిన క్షిపణి దాడులలో 86ఏళ్ళ ఖమేనీతో పాటు ఆయన కూతురు, ఆయన అల్లుడు, మనవరాలు, కోడలుతో సహా పలువురు ఉన్నతాధికారులు కూడా మృతి చెందారు.
హైదారాబాద్ కు ఖమేనీ పేరుతో అనుబంధం
అయితే మరణించిన ఖమేనీకి మన దేశంతో అనుబంధం ఉందన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఖమేనీ పూర్వీకుల మూలాలు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా కింతూర్ గ్రామానికి చెందినవి అని చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి.ఇదే సమయంలో తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ కు కూడా ఖమేనీ అన్న పేరుతో సంబంధం ఉన్నట్టు ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ లో ఖమేనీ రోడ్.. ఆయన జ్ఞాపకార్ధమే
హైదరాబాద్ లో ఖమేనీ పేరుతో ఒక రహదారి ఉండటంపైన ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది.అయితే ఈ రహదారి పేరు ఖమేనీ రోడ్ అని, ఇది ఆయన పేరు మీదే పెట్టారని చెప్పుకుంటున్నారు. కానీ అది చనిపోయిన అయాతొల్లా అలీ ఖమేనీది కాదు. ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్న ఇమామ్ అయాతొల్లా సయ్యద్ రుహేల్లా ముసావీ ఖమేనీ జ్ఞాపకార్ధం ఈ పేరు పెట్టారని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
హైదరాబాద్ తో ఇరాన్ కు బలమైన సంబంధాలు
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాల్ వైరల్ అవుతుంది. అంతేకాదు దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.జీవీకే మాల్ ఎదురుగా ఉన్న బంజారా హిల్స్ రోడ్ నంబర్ 7 ను ఇమామ్ ఖమేనీ రోడ్ గా పిలుస్తారు. ఈ మార్గంలోనే ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ఉంది. నిజాంరాజులు, కుతుబ్ షాహీలు పాలించిన కాలం నుండి హైదరాబాద్ తో ఇంరాన్ కు చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి.
హైదరాబాద్ రోడ్డుకు ఆ పేరు పెట్టటం వెనుక రీజన్ ఇదే
చాలా బలమైన చారిత్రక, సాంస్కృతిక, వాణిజ్య పరమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. అప్పటి నుండి ఉన్న దౌత్య సంబంధాలకు గౌరవ సూచకంగా, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడైన గ్రాండ్ అయాతొల్లా రుహేల్లా ఖమేనీ పేరును అప్పటి మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైదరాబాద్ అధికారికంగా పెట్టింది. హైదరాబాద్ లో ఏర్పాటు జరిగిన మొదటి దౌత్య కార్యాలయాలలో ఇరాన్ కూడా ఒకటిగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications