అలవాటులో పొరబాటు .. ప్రత్యర్థికి ఓటెయ్యాలని ఖమ్మంలో నామా తడబాటు
టిడిపి నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరి ఖమ్మం పార్లమెంట్ టికెట్ సంపాదించి టిఆర్ఎస్ పార్టీ నుండి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అలవాటులో పొరపాటు గా ఆయన తన ఎన్నికల ప్రచారంలో టిడిపికి ఓటు వేసి గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

టీడీపీని మర్చిపోలేకపోతున్న నామా
ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న టీడీపీని సైకిల్ గుర్తునుఅంత త్వరగా మర్చిపోలేకపోతున్నారు అభ్యర్థి నామా నాగేశ్వరరావు. అందుకే అలా అన్నారు. తిరిగి నాలుక కరుచుకుని తూచ్ టీడీపీ కాదు టీఆర్ ఎస్ అని తప్పు దిద్దుకున్నారు. టిడిపిలో సుదీర్ఘ అనుభవం ఉన్న, పార్టీలో కీలక నేతగా బాధ్యతలు నిర్వహించినటువంటి నామా నాగేశ్వరరావు ఇటీవలే టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయి, ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా సీటు సంపాదించుకున్నాడు.

ప్రచారంలో తడబడ్డ నామా
ఖమ్మం జిల్లాలో ఎంతోకాలంగా టిడిపిలో ఉంటూ స్థానికంగా పట్టు ఉన్న నేతగా ఉన్న నామా నాగేశ్వరరావుకు, సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని కాదని మరీ టికెట్ ఇచ్చారు గులాబీ బాస్ .ఇదంతా కూడా బాగానే ఉన్నప్పటికీ, ఇపుడు నామా టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాడు. ఇంత వరకు బాగానే ఉన్నా ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రచారంలో తడబడ్డ నామా అరే అలా అన్నానా అంటూ నాలుక కరుచుకున్నాడు.
లోకసభ ఎన్నికలు 2019: జోరుగా టీఆర్ఎస్ నేతల ప్రచారం
టీడీపీకి ఓట్ వెయ్యాలని కోరిన నామా
ఆయన ఖమ్మం లోక్ సభ నియోజక వర్గంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రచారం చేస్తూ సైకిల్ గుర్తుకే ఓటేయాలని, టీడీపీ ని తప్పకుండ గెలిపించాలని నామా అన్నారు. వెంటనే తేరుకున్న నామా మళ్ళీ తన తప్పుని సరి చేసుకొని టిఆర్ఎస్ కి పట్టం కట్టాలని మాట మార్చి తిరిగి ప్రచారం ప్రారంభించాడు. నామా నాగేశ్వరరావు కొన్ని దశాబ్దాల పాటు టీడీపీలో పని చేశారు . గతంలో ఖమ్మం ఎంపీగా సేవలు అందించారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయారు.

నాలుక కరుచుకున్న నామా ..అలవాటులో పొరబాటు
ఆ తర్వాత ఖమ్మంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్న జాక్ పాట్ తో అప్పటికప్పుడు నామా నాగేశ్వర్ రావు టీఆర్ఎస్ గూటికి చేరారు. కానీ పార్టీ మార్చినంత ఈజీగా, కండువాలు మార్చినంత తేలికగా, లోపల దశాబ్దాల పాటు మనసులో గూడుకట్టుకున్న పార్టీ భావజాలం మారుతుందా చెప్పండి. రాజకీయ అనివార్యత దృష్ట్యా పార్టీ మారారు నామా. అందుకే నామా అలవాటు పోలేదు కాబట్టే తడబడ్డాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications