మీ స్థాయికి దిగజారాలి అనుకోవడం లేదు: ఖుష్బూ సుందర్
సమంత నాగచైతన్య విడాకుల విషయంలో కేటీఆర్ పాత్ర ఉందని దారుణమైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండ సురేఖ పైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఊహించని విధంగా చాలా జుగుప్సాకరమైన విధంగా సినీనటి సమంత పైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
మీ మాటలు స్త్రీ తత్వానికి పూర్తి అవమానం
తాజాగా ఖుష్బూ సుందర్ కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల పైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం రెండు నిమిషాల ఫేమ్ కోసం ఎల్లో జర్నలిజంలో మునిగిపోయే వారు మాత్రమే ఇటువంటి భాష మాట్లాడతారని ఖుష్బూ సుందర్ పేర్కొన్నారు. కొండా సురేఖని ఉద్దేశించి ట్విట్ చేసిన ఆమె మీ మాటలు స్త్రీ తత్వానికి పూర్తి అవమానంగా భావిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొండా సురేఖకు ఖుష్బూ డిమాండ్
ట్విట్టర్ వేదికగా ఈ విషయం పైన స్పందించిన ఖుష్బూ కొండా సురేఖ.. బాధ్యతమైన పదవిలో ఉన్న వ్యక్తి చిత్ర పరిశ్రమ గురించి ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు అంటూ పేర్కొన్నారు. సినీ పరిశ్రమ ఇక పై ఇటువంటి వాటిని ఉపేక్షించదని ఖుష్బూ వెల్లడించారు. ఇలాంటి నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఒక మహిళగా మొత్తం సినీ పరిశ్రమకు మీరు క్షమాపణ చెప్పాలని ఖుష్బూ డిమాండ్ చేశారు.
కొండా సురేఖకు లీగల్ నోటీసులు
భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది వన్ వే ట్రాఫిక్ కాదని అయినప్పటికీ మేము మీ స్థాయికి దిగజారాలి అనుకోవడం లేదంటూ ఖుష్బూ సుందర్ కొండ సురేఖని ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సినీ ప్రముఖుల నుండి కొండ సురేఖ పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనను టార్గెట్ చేసిన కొండ సురేఖ దురుద్దేశపూర్వకమైన వ్యాఖ్యలు చేసి మరో మహిళను అవమానించారని అలాగే తనకు భార్య, పిల్లలు ఉన్నారని కేటీఆర్ సురేఖ వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు.
అనవసరపు తలనొప్పి తెచ్చుకున్న కొండా సురేఖ
ఇక కొండా సురేఖ వ్యాఖ్యలు విలువలకు విరుద్ధమని సినీ తారలందరూ భగ్గుమంటున్నారు. సురేఖ వ్యాఖ్యల పైన సారీ చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న వేళ కొండా సురేఖ కూడా సమంతకు తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలిపారు. ఏది ఏమైనా కేటీఆర్ ను టార్గెట్ చేయబోయిన కొండ సురేఖ అనవసరంగా సమంత నాగచైతన్య విడాకుల ప్రస్తావన తెచ్చి అడ్డంగా ఇరుక్కుపోయారు.












Click it and Unblock the Notifications