అన్ని పార్టీల్లో రేవంత్, ప్రగతిభవన్‌కు కాంగ్రెస్ జాబితా అంటూ కిషన్, బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, పలువురు మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు బీజేపీలో చేరారు. వారికి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

వికారాబాద్ జిల్లా, పరిగి ప్రాంతానికి చెందిన వన్నె ఈశ్వరప్ప తో పాటు ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయన్నారు. తెలంగాణ మా ఆస్తి.. మా కుటుంబానికే హక్కు ఉందన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ సర్కారు దిగిపోవాలని కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు కిషన్ రెడ్డి.

kishan reddy and bandi sanjay slams brs, congress party: arepally mohan joins bjp

కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీయేనని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు తప్పితే.. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ పార్టీని కోరుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేలను అమ్ముకునే పార్టీ కాంగ్రెస్ అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనని.. బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లేనని అన్నారు. ఆ రెండు పార్టీలకు ఓటేస్తే ఎంఐఎం పార్టీకి వేసినట్లేనని అన్నారు.

బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల చేతిలో చిప్ప మాత్రమే మిగులుతుందన్నారు కిషన్ రెడ్డి. పేద ప్రజలకు మద్యం తాగిస్తూ.. ప్రాణాలు బలి తీసుకుంటున్నారన్నారు. బెల్ట్ షాపుల పేరుతో బీఆర్ఎస్ సర్కారు ప్రజల రక్తం తాగుతోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక బెల్ట్ షాపులు లేకుండా చేస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నారు. త్వరలోనే బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేస్తామన్నారు.

ఆ తర్వాత బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలు నమ్ముతున్నారన్నారు. తమ అభ్యర్థుల జాబితా ఢిల్లీకి వెళ్లిందని.. కానీ, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రగతి భవన్‌కు వెళ్లిందని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నాయన్నారు. బీజేపీ తప్ప రేవంత్ రెడ్డి అన్ని పార్టీలు తిరిగారన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రగతి భవన్‌లో కొట్లాటలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు.. ఈసారి అభివృద్ధి చేసి చూపించే బీజేపీని గెలిపించాలని ప్రజలను బండి సంజయ్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+