స్టాలిన్‌పై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్, బేగంపేట రైల్వే స్టేషన్ ఇలా!
డీ లిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయనేది దుష్ప్రచారమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి బేగంపేట రైల్వే స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పరు. మరో పది శాతం పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలు అభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. రూ. 26.55 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నాయని, మరో 12 కోట్లతో రెండో విడత పులు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.

బేగంపేటలో అందరూ మహిళలే ఉద్యోగులు ఉండేలా చూస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఒకప్పుడు రైల్వే స్టేషన్‌కు వస్తే ముక్కు మూసుకునే పరిస్థితి ఉండేదని.. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ ద్వారా స్వచ్ఛ రైల్వే స్టేషన్ పేరుతో వినూత్న మార్పులు తీసుకొచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. చర్లపల్లి రై్ల్వే స్టేషన్‌ని కూడా ఆధునాతనంగా నిర్మించుకుని ప్రారంభించామన్నారు.
మరోవైపు, త్రిభాష విధానంపై జరుగుతున్న దుష్ప్రచారంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. త్రిభాష విధానం దేశంలో కొత్తేమీ కాదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విధానం ఉందన్నారు. ఏ ఒక్కరిపై కూడా బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయలేదన్నారు. ఏ భాష కావాలంటే అందులోనే చదువుకునే అవకాశం ఉందన్నారు.
తమిళ భాషలో తీసిన సినిమాలో హిందీలో డబ్ చేసి రూ. కోట్ల లాభాలను నిర్మాతలు పొందుున్నారన్నారు. వాళ్లకా లాభాలు ఎలా వస్తున్నాయి? భాష పేరుతో దేశాన్ని విభజించాలని చూడటం సరికాదని కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఏం చేశాడో చెప్పి తమిళనాడు ప్రజల్ని ఓట్లు అడగాలన్నారు. ఆయనేం చేయలేదు కాబట్టే భాష పేరుతో దుష్ప్రచారం చేస్తూ ఎన్నికలు దాటేయాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.
Live: Inspecting the ongoing redevelopment work at Begumpet Railway Station, Hyderabad. https://t.co/8FChBo8MUv
— G Kishan Reddy (@kishanreddybjp) March 15, 2025
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని కొందు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పునర్విభజనకు సంబంధించి 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంో ఉన్నప్పటి విధానాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గా పునర్విభజనపై కొత్త విధానం రాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
-
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications