రేవంత్.. నీ ఆదాయంపై విచారణకు సిద్ధమా?: కాళేశ్వరంపై విచారణ ఏమైందంటూ కిషన్ రెడ్డి సవాల్
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రశ్నించారు. ఎంపీ హోదాలో సీబీఐకి వివరాలు ఇస్తానని రేవంత్ అన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం హోదాలో కాళేశ్వరంపై ఎందుకు మౌనంగా ఉన్నారని కిషన్ రెడ్డి నిలదీశారు.
Recommended Video

కాళేశ్వరం అవినీతి విషయంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కాంగ్రెస్ రక్షిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు తాను కాదు, కాంగ్రెస్ పార్టీనే బినామీ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ఆవేదన చెందారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్థానం ఎలా మొదలైందో ప్రజలకు తెలుసునని కిషన్ రెడ్డి అన్నారు.

సీఎం ఆదాయం, తన ఆదాయంపై విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. కాళేశ్వరంలో బీజేపీకు వాటా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోందని, వాటిని నిరూపించాలని కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు. లంకెబిందెలు కోసమే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారా? అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
కాగా, బుధవారం జరిగిన టీపీసీసీ సమావేశం సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీపైనా విమర్శలు గుప్పించారు రేవంత్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్లు ఉందని.. అందుకే కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారని ఎద్దేవా చేశారు. అనాడు తాను స్వయంగా సీబీఐ ఎంక్వయిరీ కోరినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నారన్నారు. కాళేశ్వరం అవినీతిపై తాము జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్‌ఎస్ తోడు దొంగలు, ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని ఆరోపించారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications