‘యాదాద్రి వరకు ఎంఎంటీఎస్’కు తెలంగాణ ప్రభుత్వం సహకరించట్లేదు: కిషన్ రెడ్డి

ఎంఎంటీఎస్ విస్తరణకు సహకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

హైదరాబాద్: ఎంఎంటీఎస్ విస్తరణకు సహకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బర్కత్‌పురాలోని యాదాద్రి భవన్ నుంచి యాదగిరిగుట్టకు బయల్దేరిన అఖండ జ్యోతియాత్రను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అఖండ జ్యోతి వెళ్లే మార్గంలో అన్ని వర్గాల ప్రజలు జ్యోతిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు కిషన్ రెడ్డి.

కొత్త దేవాలయాలను నిర్మించడం కన్నా ఉన్న ఆలయాల్లో సౌకర్యాలను మెరుగుపర్చి పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 156 దేవాలయాలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.

 Kishan Reddy slams telangana government for mmts phase-2 expand issue

కాగా, ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు నిర్మించాలనుకుంటున్న ఎంఎంటీఎస్ ఫేజ్-2కు కేసీఆర్ సర్కారు సహకరించడం లేదని ఆరోపించారు. భూసేకరణ పనులు ఎంత తొందరగా ప్రారంభిస్తే.. అంతే త్వరగా పనులు చేపడతామని సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

అయినప్పటికీ ఎంఎంటీఎస్ లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందడం లేదన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 విషయంలో ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చొరవ చూపాలని కోరారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+