సికిందరాబాద్ పోలింగ్ సరళిపై కిషన్ రెడ్డి టెన్షన్ .. అనుమానాలెన్నో!

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చావు దెబ్బ తిని ఓటమిపాలైన బిజెపి నేతలు ఈ ఎన్నికల్లో అయినా తమ ఉనికి చాటుతామా లేదా అన్న భయంలో ఉన్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ల‌క్‌పేట నుంచి పోటీ చేసి ఓట‌మి పాలైన బీజేపీ అభ్య‌ర్థి కిష‌న్‌రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రచారంలో బాగానే కష్టపడ్డారు . సికిందరాబాద్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసిన ఆయన సికిందరాబాద్ లో పోలైన ఓటింగ్ సరళిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు .

బీజేపీ అభ్య‌ర్థి కిషన్ రెడ్డి రాజ‌కీయాల్లోకి రాక‌ముందు సెంట్ర‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా పొందారు. ఆ త‌రువాతే ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఆ కార‌ణంగానే ఆయ‌న సికింద్రాబాద్‌లో జ‌రిగిన పోలింగ్ స‌ర‌ళిపై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం చాలా ఆసక్తికరంగా మారింది . సాయంత్రం పోలింగ్ ముగిసే వ‌ర‌కు అక్క‌డ జ‌రిగిన పోలింగ్ శాతం 39 శాతమే .కానీ చివ‌రి గంట‌లో దాదాపు 6 శాతం ఓటింగ్ పెర‌గ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌ని కిష‌న్ రెడ్డి అంటున్నారు.

Kishan Reddy Tension on Secunderabad Polling Pattern ..So many doubts!

సికింద‌రాబాద్ ఓటింగ్ స‌ర‌ళిపై అనుమానాలున్నాయ‌ని వ్య‌క్తం చేసిన కిష‌న్ రెడ్డి ఈ విష‌యాన్ని ఎల‌క్ష‌న్ రిట‌ర్నింగ్ అధికారి ర‌వి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎన్నికల అధికారి మాత్రం గేట్లు మూసే స‌మ‌యానికే కొంత మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి లోప‌ల క్యూలైన్‌లో వున్నార‌ని, వారి కార‌ణంగానే చివ‌రి గంట‌లో ఓటింగ్ శాతం 6గా న‌మోదు అయ్యిందని దీంతో మొత్తం ఓటింగ్ శాతం 45 శాతానికి పెరిగింద‌ని వెల్ల‌డించారు . అయినా కిషన్ రెడ్డికి మాత్రం చివరి గంటలో జరిగిన పోలింగ్ పై అనుమ్మానం పెరిగిందే తప్ప త‌గ్గ‌డం లేదు. ఇక ఈ వ్యవహారంలో పార్టీ అధ్ష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అంటున్నారు కిషన్ రెడ్డి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+