ఎవరి మ్యూజిక్‌కి.. ఎవరు డ్యాన్స్?: కేటీఆర్‌కు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీని విమర్శిస్తూ చేసిన కేటీఆర్ ట్వీట్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గురివింద గింజ తరహాలో.. బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిని కాంగ్రెస్‌లోకి.. చేతి గుర్తుపై గెలిచిన వారిని గులాబీ పార్టీలోకి పంపించుకుని.. మంత్రి పదవులు తీసుకున్నప్పుడు.. ఎవరు? ఎవరితో కలిసినట్లో కేటీఆర్ చెప్పగలరా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

మేం గిల్లినట్లు చేస్తాం.. మీరు ఏడ్చినట్లు చేయండని తెరచాటు ఒప్పందంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ అనుసరించిన మోసపూరిత విధానాలనే.. కాంగ్రెస్ పార్టీ ఏడాదిా అనుసరిస్తోందని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం చూస్తే ఎవరితో ఎవరు కలిసున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఎవరు సంగీతం వాయిస్తే.. ఎవరు డ్యాన్స చేస్తున్నారో ప్రజలకు ఇప్పటికే అర్థమైందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
బీజేపీ ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన పార్టీ అని అన్నారు. జాతీయవాదం, అంత్యోదయం వంటి నినాదాలతో పనిచేసే పార్టీ తమదని కిషన్ రెడ్డి చెప్పారు. కుటుంబపాలన, అవినీతి వంటివి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలని ధ్వజమెత్తారు. అందుకే ఎవరికి ఎవరు దోస్తులనేది తెలంగాణ సమాజానికి తెలిసిపోయిందన్నారు. రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్న సందర్భంలో.. ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో ఉండాలనుకునే మనస్తత్వాలకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications