'కెసిఆర్ లేకుంటే తెలంగాణ లేదు, బాబుకు వెళ్లబుద్ది కావట్లేదు', 'రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ టార్గెట్'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఉండకపోయేదని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు ఆదివారం అన్నారు. తెలంగాణ భవన్లో కెకె, హరీష్ రావు, నాయిని నర్సింహా రెడ్డి తదితరులు మాట్లాడారు.
చంద్రబాబుకు హైదరాబాదును వదిలిపెట్టి వెళ్లబుద్ది కావడం లేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. హైదరాబాదుకు తాగునీరు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. త్వరలో 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. చెత్త సేకరణకు 2వేల ఆటోలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కెసిఆర్ ప్రతి అడుగు పేదల కోసమే అన్నారు.
చరిత్రలో నిలిచిపోయేలా హరితహారం చేస్తున్నారని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. తెలంగాణలో పచ్చదనం కోసం కెసిఆర్ అశోకుడిలా పని చేస్తున్నారన్నారు. తెలంగాణను నెంబర్ వన్ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను అణిచివేసే కుట్ర: ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే అణిచివేయాలని కెసిఆర్ చూస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాజకీయం వికృతరూపం దాల్చిందన్నారు. పార్టీలో సేవ చేసి వారిని గుర్తిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో పదవులు అన్ని అనుభవిచి, ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు నేతలు సిగ్గులేకుండా పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేకత పైన తాము పోరాడుతామని చెప్పారు. రాష్ట్రాన్ని ఇచ్చిన తమనే అణిచివేయాలని చూస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications