కోమటిరెడ్డి వెనుక ఆ పెద్దాయన : రేవంత్ కు వ్యతిరేకంగా-ఢిల్లీలోనూ : నాడు రాష్ట్రంలో చక్రం తిప్పి..!!
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమాకంతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోందని హైకమాండ్ భావించింది. అయితే, కేసీఆర్ ను ఎలాగైనా ఓడించాలనే కసితో ఉన్న కాంగ్రెస్ నేతల్లో అనేక మంది రేవంత్ కు మద్దతివ్వటం మనసులో ఇష్టం లేకున్నా.. అయిష్టంగానే కలిసి సాగుతున్నారు. కొందరు నేతలు కొన్నింట కలుస్తూ..మరి కొన్ని వ్యవహారాల్లో దూరంగా ఉంటూ ఉన్నారు. అయితే, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఏ మాత్రం రాజీ పడటం లేదు. రేవంత్ తో పాటుగా చివరి విమిషం వరకూ కోమటిరెడ్డి పోటీలో నిలిచారు. అయితే, కాంగ్రెస్ అధినాయకత్వం చివరకు రేవంత్ రెడ్డికే పదవి కట్టబెట్టింది.

రేవంత్ కు వ్యతిరేకంగా తొలి నుంచీ..
ఆ వెంటనే కోమటి రెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. టీపీసీసీ పదవి అమ్ముకున్నారని...తెలుగుదేశం నేతలు తన వద్దకు రావాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. ఆ తరువాత జోరు తగ్గినా.. గాంధీ భవన్ కు మాత్రం రాలేదు. రేవంత్ పలు కార్యక్రమాలు నిర్వహించినా..ఆయనతో కలిసి వేదిక పంచుకో లేదు. ఇక, తాజాగా.. నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం వేదికగా దళిత గిరిజన దండోరా సభ నిర్వహిస్తామంటూ ఇంద్రవెల్లి సభ వేదికగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే, అనూహ్య రీతిలో ఆ సభను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది.

తాజాగా కోమటిరెడ్డి అలక..
మహేశ్వరం నియోజక వర్గంలోకి సభను మారుస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభ అదే తేదీలో మరో చోట జరుగుతుందన్న క్లారిటీ ఇచ్చింది. వేదిక మార్పు వెనుక అసలు కారణం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని తెలుస్తోంది. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, తనను అడగకుండా తన పార్లమెంటు స్థానం పరిధిలోకి వచ్చే ఇబ్రహీంపట్నంలో సభ ఎలా ప్రకటిస్తారని కోమటిరెడ్డి అభ్యంతరం తెలిపారు. దీనికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ తీరుపై ఆయన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు.

వెంకన్న తో పార్టీ నేతల చర్చలు..
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కె.సి.వేణుగోపాల్ వరకు వ్యవహారం వెళ్లడంతో ఆయన కోమటిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. అనంతరం కోమటిరెడ్డి, రేవంత్‌లు ఫోన్‌లో మాట్లాడుకున్నారని, తనకు ఈనెల 17 నుంచి 21 వరకు బొగ్గు, స్టీల్ పార్లమెంటరీ స్టాం డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో స్టడీ టూర్ ఉన్నందున తాను సభకు రాలేనని, ఆ టూర్ కోసం గోవాకు వెళ్తున్నానని కోమటిరెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ లో మరో ఆసక్తి కర చర్చ మొదలైంది.

కోమటిరెడ్డికి మద్దతుగా కేవీపీ..
పార్టీ హైకమాండ్ వద్ద పలుకుబడి ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత అయిన కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు అన్నింటా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. వైఎస్ హాయంలో అటు ప్రభుత్వం...ఇటు పార్టీలోనూ అన్నీ తానై వ్యవహరించిన కేవీపీ పూర్తిగా కోమటిరెడ్డికి అండా ఉంటున్నారని ప్రచారం. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి కాకుండా..కోమటిరెడ్డికి వచ్చేలా కేవీపీ చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. వైఎస్ హాయంలో నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డిని ప్రోత్సహించారు.

కాంగ్రెస్ అధినాయకత్వం వద్ద లాబీయింగ్..
జానారెడ్డి-ఉత్తమ్ రెడ్డిని కాకుండా కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. వైఎస్ హాయం లో రాజ్యసభ సభ్యుడు అయిన కేవీపీ..వైఎస్ ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వానికి బాగా దగ్గరయ్యారు. అయతే, వైఎస్ మరణం తరువాత కూడా ఆయన కాంగ్రెస్ లో కంటిన్యూ అయ్యారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయం నుంచి వైఎస్ తో పాటుగా కేవీపీ పైన తీవ్ర ఆరోపణలు చేసేవారు. ఇక, కేసీఆర్- ఒక కాంట్రాక్టర్ మధ్య కేవీపీ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చేసేవారు. దీంతో..కోమటిరెడ్డికి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల వద్ద అండగా ఉంటూ..మద్దతిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

ఏపీ నేత అయినా..తెలంగాణ పార్టీ వ్యవహారాల్లోనూ..
ఇక, తాజాగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల విషయంలోనూ రాహుల్ గాంధీ..అక్కడి పరిస్థితుల పైన తీసుకోవాల్సిన చర్యలను సూచించాల్సిందిగా కేవీపీని కోరారు. అయితే, ఇప్పుడు రేవంత్ మాత్రం కేవీపీ పైనా.. కోమటిరెడ్డి పైనా ఓపెన్ గా ఏదీ మాట్లాడటం లేదు. కానీ, రేవంత్ కు వ్యతిరేకంగా సాగుతున్న రాజకీయం మాత్రం ఇప్పుడు పార్టీ లో నివురు గప్పిన నిప్పులా మారుతోంది. రానున్న రోజుల్లో ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఇప్పుడు కాంగ్రెస్ లో ఉత్కంఠగా మారుతోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications