నాపై చర్యలు ఈజీ కాదు, జానారెడ్డిని పనికిరారని తిట్టారుగా: కోమటిరెడ్డి
నల్గొండ: సీఎల్పీ నేత జానా రెడ్డి పనికిరారని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వందసార్లు తిట్టారని, సర్వే సత్యనారాయణ గాంధీ భవన్లోనే జానారెడ్డిని తీవ్రంగా విమర్శించారని, వారందరికీ లేని షోకాజ్ నోటీసు తనకెందుకని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం నాడు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కోమటిరెడ్డి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కన్నా ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతగాని వాడన్నారు.

తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై కోమటిరెడ్డి తీవ్రంగా స్పందించారు. గతంలో పాల్వాయి గోవర్థన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ వంటి వారెందరో కాంగ్రెస్ లీడర్లను తిట్టారని గుర్తు చేశారు. వారికి షోకాజ్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
కేసీఆర్ ఆఫర్‌పై గుత్తా ఫిట్టింగ్, కోమటిరెడ్డి కొత్త ఝలక్
కాంగ్రెస్ పార్టీ ఓ మహాసముద్రం లాంటిది అన్నారు. ఇటువంటి విషయాలు సర్వసాధారణమేనని చెప్పారు. నోటీసుకు తాను సమాధానం పంపుతానని తెలిపారు. తన పైన పార్టీ నేతలు చర్యలు తీసుకోవడం అంత సులువు కాదని చెప్పారు.
కృష్ణా డెల్టా పైన ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కృష్ణా బోర్డు నిర్ణయాలు అమలు చేస్తే పాలమూరు, నల్గొండ జిల్లాలు ఎడారిగా మారుతాయన్నారు. కేంద్రానికి లేఖలు రాసి చేతులు ముడుచుకొని కూర్చోవడం సరికాదని, సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలవాలని సూచించారు.












Click it and Unblock the Notifications