ఆ ఆరోపణలు నిరూపించు: మంత్రి కేటీఆర్‍కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్

మంత్రి కేటీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్ తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ చేశారు.

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్ తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ చేశారు. కేటీఆర్‌కు ఏ మాత్రం విశ్వసనీయత, నిజాయితీ ఉన్నా.. తాను బీజేపీలో చేరినందుకు రూ. 18వేల కోట్ల కాంట్రాక్టు పొందానని నిరూపించాలని డిమాండ్ చేశారు.

తన విషయంలో గ్లోబల్స్ ప్రచారం పని చేస్తుందని అనుకోవద్దని ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు హితవు పలికారు. కాగా, గురువారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మునుగోడులో ఒక వ్యక్తికి రూ. 18వేల కోట్ల కాంట్రాక్టును బీజేపీ ముట్టజెప్పిందంటూ రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ఆరోపణలు చేశారు.
ఇన్ని వేల కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

Komatireddy Rajagopal Reddy challenge to minister KTR on Rs 18k crore contract issue

తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు.. బీజేపీలో చేరగానే వారు సత్యవంతులైపోతారని అన్నారు. వారి మీద ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల దాడులు ఉండవన్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీలో చేరగానే వారిపై ఉన్న కేసులు అన్నీ మాయమైపోయాయి ఏంటో ఆ విడ్డూరం తెలియడం లేదన్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో మునుగోడుకు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే, ఈ ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోగా.. బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+