కేటీఆర్.. నీకు 24గంటల టైమ్ ఇస్తున్నా; క్విడ్ ప్రోకో నిరూపించమన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటీఆర్ ను టార్గెట్ చేసి ఆయన చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు.
కోమటిరెడ్డి క్విడ్ ప్రోకో కు పాల్పడ్డారన్న మంత్రి కేటీఆర్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని, మంత్రి కేటీఆర్ ఆయనను టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టిన మంత్రి కేటీఆర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక తెలుగు ఛానల్ చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసి ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను పోస్ట్ చేసి మరీ ట్వీట్ చేశారు. 18 వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు దక్కినందుకుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇది క్విడ్ ప్రో కో కాక మరేమిటి అని మంత్రి కేటీఆర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు.
ఆ వీడియో పోస్ట్ చేసి టార్గెట్ .. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి మంత్రి కేటీఆర్ చురకలు
ఇక ఇదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి బాటలోనే సాగితే మంచిదని చురకలంటించారు. ఆరు నెలల క్రితం ఓ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ కంపెనీకి 18 వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు దక్కిందని స్వయంగా వెల్లడించారు. ఓపెన్ బిడ్డింగ్ లో పాల్గొన్న కంపెనీ కాంట్రాక్టు సాధించిందని ఆయనే స్వయంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పార్టీ నేతలు తెగ వైరల్ చేస్తున్నారు.

మంత్రి కేటీఆర్ కు సవాల్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఇదిలా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి కేటీఆర్ చేసిన పోస్ట్ పై ఘాటుగా స్పందించారు. తాను బీజేపీలో చేరేందుకు 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు వచ్చిందన్న మంత్రి కేటీఆర్ ఆరోపణలపై మండిపడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు.
తాను 24 గంటలు టైం ఇస్తున్నానని పేర్కొన్న ఆయన, క్విడ్ ప్రో కో జరిగిందని, నా పై నువ్వు చేసిన ఆరోపణలను నిరూపించు లేదంటే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటుగా బదులిచ్చారు. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సవాల్ కు కేటీఆర్ ఎలా ప్రతిస్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications