telangana congress: కోమటిరెడ్డి అలా.. రేవంత్ రెడ్డి ఇలా; హస్తం పార్టీపై భస్మాసుర హస్తం!!

రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి రేవంత్ మాట్లాడింది తప్పే అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. నేతల తీరుతో కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడుతుంది.

మితిమీరిన స్వాతంత్రం ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు కాంగ్రెస్ పార్టీ పరువును బజారున పెడుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు, మనుగడ కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ పార్టీకి నేతలు తీరే పెద్ద తలనొప్పిగా మారింది. ప్రత్యర్థి పార్టీలను సమర్ధవంతంగా ఎదుర్కోవలసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారిలో వారు విమర్శలు చేసుకోవడం.. ఒకరిని ఒకరు ముందుకు వెళ్లకుండా లాగాలని ప్రయత్నం చేయడం వెరసి కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు... కాంగ్రెస్ లోనూ మల్లగుల్లాలు

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు... కాంగ్రెస్ లోనూ మల్లగుల్లాలు


తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కాంగ్రెస్ పార్టీలో లుకలుకలను మళ్లీ బయటపెడుతోంది. ఒకరిని మించి ఒకరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నేతలు పనిచేయడం పార్టీ కార్యకర్తల్లో ఆందోళనకు కారణంగా మారింది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభంలోనే ప్రగతి భవన్ ను బాంబులతో మావోయిస్టులు పేల్చేయాలని పిలుపునివ్వడం రాజకీయంగా రగడగా మారింది. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ కూడా నిప్పులు చెరిగారు. టిపిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పని కాంగ్రెస్ పార్టీ నేతలలోను అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

రేవంత్ ప్రగతి భవన్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందన ఇలా

రేవంత్ ప్రగతి భవన్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందన ఇలా

ఇక ఏకంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి నక్సలైట్లు ప్రగతి భవన్ ను పేల్చేయాలని చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. రేవంత్ రెడ్డి అలా అనకుండా ఉండాల్సిందని పేర్కొన్న ఆయన ప్రగతి భవన్ ను ప్రజా దర్బార్ గా వినియోగించాలనో, ఆసుపత్రిగా వాడుకోవాలనో రేవంత్ అంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు అని అర్థం వచ్చేలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డిని తీవ్రంగా బాహాటంగా వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటే, వారి విమర్శలకు మరింత బలం చేకూర్చేలా మారాయి.

రేవంత్ తీరు ఇలా.. నైరాశ్యంలో కాంగ్రెస్ శ్రేణులు

రేవంత్ తీరు ఇలా.. నైరాశ్యంలో కాంగ్రెస్ శ్రేణులు

ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాల్సిన చోట.. ఏదేదో మాట్లాడటం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నేతలు ఎవరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించటం లేదన్న చర్చ జరుగుతుంది. ఇక ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏమాత్రం రుచించడం లేదు. సీనియర్ నాయకులు ఎవరూ సమన్వయంతో పనిచేయకపోవడం, పార్టీ కోసం ఒక మాటగా నిలబడకపోవడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో పార్టీ పట్ల నైరాశ్యాన్ని పెంచుతుంది.

సొంతపార్టీ పరువు తీస్తున్న కాంగ్రెస్ నాయకులు

సొంతపార్టీ పరువు తీస్తున్న కాంగ్రెస్ నాయకులు

ప్రత్యర్థి పార్టీల మీద దాడి చేయకుండా సొంత పార్టీ నేతల మాటలను ఎవరికి వారు కౌంటర్ చేస్తూ ఉండడం పార్టీ పరువును బజారుకీడుస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి పాదయాత్రలో సీనియర్లు కనపడకపోవడంతో పార్టీ నేతల తీరుపై బయట చర్చ జరుగుతున్న వేళ, ఇక సొంత పార్టీ నేతల వ్యాఖ్యల పైన అభిప్రాయాలు చెబుతూ కాంగ్రెస్ సీనియర్లు చేస్తున్న రచ్చ హస్తం పార్టీకి భస్మాసుర హస్తంగా మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+