రేవంత్ రెడ్డికి నామినేషన్ డబ్బులు ఇచ్చిన కొనాపూర్ వాసులు.. కేసీఆర్ పై ఆగ్రహం!!
తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈరోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నాయకులు నామినేషన్ల పర్వాన్ని పూర్తి చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్యనే పోటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. టిఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కెసిఆర్ స్టార్ క్యాంపెయినర్ గా సుడిగాలి పర్యటనలు చేస్తుంటే, రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారాన్ని సాగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో హడావిడి చేస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంచి జోష్ తో ఉన్నారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి కొనాపూర్ లో పర్యటించారు. ఈ క్రమంలో కొనాపూర్ గ్రామస్తులు రేవంత్ రెడ్డిని చూసి హర్షం వ్యక్తం చేశారు. కెసిఆర్ పూర్వీకుల గ్రామమైన కొనాపూర్ కు కెసిఆర్ చేసింది ఏమీ లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి నామినేషన్ డబ్బులను అందజేసిన కేసీఆర్ పూర్వీకుల గ్రామం కొనాపూర్ గ్రామస్తులు కెసిఆర్ ని గద్దె దించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ గెలవాలని వారు కోరుకున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కెసిఆర్ కు గుర్తొచ్చిందా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా తమ గ్రామం నిర్లక్ష్యానికి గురైందని, కానీ ఇప్పుడు ఓట్ల కోసమే వస్తున్నారని పార్టీ నాయకులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎట్టి పరిస్థితిలోనూ కొనాపూర్ గ్రామస్తులు కెసిఆర్ కు ఓటు వేసేది లేదని వారు తేల్చి చెప్పారు. కేవలం కెసిఆర్ పాలన పైన విరక్తితో, కెసిఆర్ ను గద్దె దించడం కోసమే రేవంత్ రెడ్డికి గ్రామస్తులంతా కలిసి నామినేషన్ డబ్బులు అందజేశామని వారు చెబుతున్నారు. ఇక తెలంగాణ రేవంత్ రెడ్డి కూడా కెసిఆర్ ను తప్పనిసరిగా గద్దె దించుతామని అప్పటివరకు అలుపెరుగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications