వచ్చే ఎన్నికల్లో కొండా సురేఖ పోటీ అక్కడ నుండే; తగ్గేదేలే... కొండా మురళి!!
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నాయకులు దూకుడు పెంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటికే వివిధ నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తూ, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం పై ఫోకస్ పెట్టిన కొండా దంపతులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుని, వారికి అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. తాజాగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటీవల వర్షాలకు ఇళ్ళు కూలిపోయి నష్టపోయిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పరామర్శించారు. వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని చెప్పారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీ చేస్తారని, అందులో ఎటువంటి అనుమానం లేదని వెల్లడించారు. కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, కొండా సురేఖకు ఉన్నత పదవి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేసే నాయకుడు కాదన్నారు. గతంలో కేసీఆర్ పర్యటనకు వచ్చిన సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని ఆ హామీలకు ప్రజలంతా చప్పట్లు కొట్టి ఆనంద పడ్డారని కొండ మురళి పేర్కొన్నారు. కానీ తాను, కొండా సురేఖ కెసిఆర్ పై నమ్మకం లేక చప్పట్లు కొట్టలేదని ఆయన వెల్లడించారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు మళ్లీ తెలంగాణలో రిపీట్ అవుతాయని కొండ మురళి స్పష్టం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఎమ్మెల్యే చేసిందేమీ లేదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను టార్గెట్ చేశారు కొండ మురళి. కొండా సురేఖకు మళ్లీ అవకాశం ఇస్తే ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తాను ముందు ఉంటుందని కొండ మురళి అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications