సమంత నుండి సుమంత్ వరకు వివాదాల కొండా సురేఖ..మంత్రిపదవి ముగిసినట్టే!

తెలంగాణ రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంట్రవర్సీ ల కొండా సురేఖ ఎపిసోడ్లో తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో సురేఖ పైన వేటు వేసేందుకు నిర్ణయం తీసుకుంటారని జోరుగా చర్చ జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే కొండా సురేఖ వ్యవహారంలో కీలక అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, సురేఖ ఓఎస్డి గా ఉన్న సుమంత్ ను తొలగించి కొండా సురేఖకు షాక్ ఇచ్చింది.

సురేఖ ఇంటివద్ద భద్రత తొలగింపు
కొండా సురేఖ వద్ద పనిచేస్తున్న సుమంత్ డెక్కన్ సిమెంట్స్ కు సంబంధించిన వ్యక్తులను గన్ తో బెదిరించాడని తాజాగా వీడియో కూడా బయటకు రావడంతో, కొండా సురేఖ పైన చర్యలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లోని కొండా సురేఖ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు హన్మకొండలోని సురేఖ నివాసం వద్ద భద్రతను తొలగించి అవుట్ పోస్ట్ ను తీసివేశారు.

konda Surekha embroiled in controversies from Samantha to Sumanth seems her minister post Ousting

Take a Poll

రేవంత్ పై కొండా సుస్మిత షాకింగ్ వ్యాఖ్యలు
హన్మకొండ లో కూడా సురేఖ నివాసం వద్ద పోలీసులు మోహరించారు . తాజా పరిణామాలతో సుమంత్ ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్టు చేయడానికి మహిళా పోలీసులు వచ్చారని సుస్మిత ఆరోపించడంతో పాటు, రెడ్లు అందరూ ఏకమై తమ పైన కుట్ర చేస్తున్నారని భగ్గుమన్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత రోహణ్ రెడ్డి కూడా ఉన్నారని ఆయన వెనుక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందా అంటూ ప్రశ్నించారు.

కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించే వ్యూహం
ఏకంగా టెండర్ల పేరుతో, సెటిల్మెంట్ల పేరుతో సీఎం అనుచరుడు రోహణ్ రెడ్డి, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతిరెడ్డి దందాలు చేస్తున్నారని, రేవంత్ అంతర్గత విషయాలు బహిరంగంగా మీడియా ముందు ప్రస్తావించినందుకు కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించేందుకు, ఆమెపైన వేటు వేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

సమంత నుండి సుమంత్ వరకు వివాదాల సురేఖ
తెలంగాణ రాష్ట్రంలో కూడా మంత్రిగా అవకాశం వచ్చిన నాటినుండి అడుగడుగునా కాంట్రవర్సీ లతో ఉన్న కొండా సురేఖను ప్రస్తుతం మంత్రి పదవి నుంచి తొలగిస్తారని జోరుగా చర్చ జరుగుతుంది. నాగచైతన్య సమంతల వ్యవహారంలో సమంత గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం దగ్గర నుండి వరంగల్ జిల్లాలోని నాయకుల మీద, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం దాకా సురేఖ అన్నీ వివాదాల్లోనే చిక్కుకున్నారు.

అదును చూసి దెబ్బ కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
ఇక ఆమె ఓఎస్డీ సుమంత్ బెదిరింపుల, వసూళ్ళ వ్యవహారం వంటి అనేక పరిణామాలతో కొండా సురేఖ పైన విసిగిపోయిన కాంగ్రెస్ నాయకులు ఆమె పైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేశారు. అయితే గత కొంతకాలంగా ఈ వ్యవహారంపై సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం, ప్రస్తుతం అదును చూసి దెబ్బ కొడుతున్నట్టు తెలుస్తోంది.

సురేఖ ఎపిసోడ్ తో అధికార కాంగ్రెస్ చిక్కుల్లో
కొండా సురేఖ పైన వేటు పడే అవకాశం తాజా పరిణామాలతో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు కొండా సురేఖ సైతం తమ అనుచరులను, పార్టీ శ్రేణులతో తన నియోజకవర్గంలో భేటీ కావడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఎపిసోడ్ తో తాజా పరిణామాలు అధికార కాంగ్రెస్ ను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+