Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొండా సుస్మిత (చిట్టెక్క) పొలిటికల్ గ్రాండ్ ఎంట్రీ అప్పుడే.. కొండా సురేఖ సంచలనం!!

తెలంగాణ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న కొండ సురేఖ ప్రస్తుత తెలంగాణ రాజకీయాలపైన, రాజకీయాలలోకి తన కుమార్తె కొండా సుస్మిత గ్రాండ్ ఎంట్రీ పైన వన్ఇండియా తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా తన కుమార్తె కొండ సుస్మిత అలియాస్ చిట్టెక్క కీలకంగా రాజకీయాల్లోకి ఎప్పుడు రాబోతున్నారు అన్న అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కొండ సురేఖ, కొండా మురళి దంపతుల ఏకైక కుమార్తె, వారి ముద్దుల పట్టి కొండ సుస్మిత. దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్న ఇద్దరు దంపతులు తమ కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే తన రాజకీయ అరంగేట్రం చాలా గ్రాండ్ గా ఉండాలని, అందరికి మద్దతుతో జరగాలని ఆలోచిస్తున్నట్టు కొండా సురేఖ చెప్పిన అంశాల బట్టి అర్ధం అవుతుంది.

ఈ క్రమంలో చిట్టెక్క పొలిటికల్ ఎంట్రీపై వన్ ఇండియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కొండా సురేఖ తన కుమార్తె ప్రజలను, ప్రజా జీవితాన్ని ముందు చూడాలని, ఒక సంవత్సరం పాటు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగాలని, ఆ తరువాత పార్టీలో ప్రాధాన్యత, పదవులు, ఎన్నికల్లో పోటీపై ఆలోచిస్తామని కొండా సురేఖ స్పష్టం చేశారు.

గతంలో కొండా సురేఖ కుమార్తె చిట్టెక్క గతంలో భూపాలపల్లి నుండి పోటీ చేయాలని భూపాలపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఫేస్బుక్ పేజ్ తో తాను చేస్తున్న కార్యక్రమాలను గురించి చెబుతూ సందడి చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలోనే చిట్టెక్క పొలిటికల్ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసిన కొండ మురళి, అప్పుడు ఆ పార్టీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

 Konda Surekha sensation on Konda Sushmita political grand entry!!

భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయించాలని ప్రయత్నించారు. ఆపై కాంగ్రెస్ లోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలోనూ కుటుంబంలో ఒకరికి టికెట్ అని చెప్పడంతో, అప్పుడు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి కొండా సుస్మితకు టికెట్ దక్కని పరిస్థితి. దీంతో అప్పుడు ఆమె ఎంట్రీకి బ్రేక్ పడింది. మళ్ళీ ఇప్పుడు తల్లిదండ్రులతో కలిసి ప్రజల వద్దకు వెళ్తూ రాజకీయంగా అడుగులు వేస్తున్నారు సుస్మిత.

అయితే తల్లిదండ్రులు మాత్రమే కాదు, ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో కొండ సుస్మిత కూడా అందెవేసిన చెయ్యి. ఎర్రబెల్లి దయాకర్ రావు అని నేరుగా బెదిరించినా.. సవాల్ విసిరినా సూటిగా, సుత్తి లేకుండా డైరెక్ట్ ఎటాక్ చేయగలిగిన సుస్మిత కీలకంగా రాజకీయాల్లో భూమిక పోషించాలని చాలామంది కొండా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొండ సురేఖ సుస్మిత గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీపై చెప్పిన సమాధానంతో వారి నిరీక్షణకు త్వరలోనే ఫలితం దక్కబోతోంది అని తెలుస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+