Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు; తెలంగాణ హై కోర్ట్ సంచలన తీర్పు!!

కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై అనర్హత వేటు పడింది. తెలంగాణ హైకోర్టు ఈ మేరకు సంచలన తీర్పును వెల్లడించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమాకు షాక్ ఇచ్చింది.

2018 ఎన్నికలలో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగి 4,139 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వనమా వెంకటేశ్వరరావు పై అప్పుడు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన జలగం వెంకట్రావు పోటీ చేశారు. వనమా వెంకటేశ్వరరావు కు 81 వేల 118 ఓట్లు రాగా, జలగం వెంకట్రావుకు 76,719 ఓట్లు పడ్డాయి.

kothagudemmlavanamavenkateswararao

ఇక రెండో స్థానంలో ఉన్న జలగం వెంకట్రావు వనమా ఎన్నిక చెల్లదని, ఆయన ఎన్నికల అఫిడవిట్ లో అవకతవకలు ఉన్నాయని 2019లో హైకోర్టును ఆశ్రయించారు. 2018 కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తన నామినేషన్ పత్రాలతో పాటు ఫారం 26 లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని జలగం వెంకటరావు తన పిటిషన్ లో పేర్కొని, ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

దీంతో తనకు వ్యతిరేకంగా దాఖలైన ఎన్నికల పిటిషన్ లోని పలు పిటీషన్లను తొలగించాలని కోరుతూ చేసిన మధ్యంతర దరఖాస్తులు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి మార్చి 14వ తేదీన తోసిపుచ్చారు. ఆపై కేసును విచారించి తీర్పు రిజర్వ్ చేసి నేడు సంచలన తీర్పును వెల్లడించారు.ఈ క్రమంలో ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం వనమా ఎన్నిక చెల్లదని సంచలన తీర్పును వెల్లడించింది.

వనమా వెంకటేశ్వరరావుకు 5 లక్షలు జరిమానాతో పాటుగా అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు, జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా ప్రకటించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని నిబంధనల ప్రకారం వనమా వెంకటేశ్వరరావు పై వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో, అనర్హత వేటు పడిన నాటినుండి ఆరేళ్లపాటు ఆయన ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హులవుతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+