Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో గుమ్మడికాయ నైవేద్యం వెనుక రహస్యమిదే!

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం లోని, హన్మకొండ జిల్లా, హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం, భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి చాలా విశేషమైన చరిత్ర ఉంది. దేశంలో ఎక్కడైనా ఆలయాలలో కొబ్బరికాయలను నైవేద్యంగా సమర్పిస్తే, కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో రాచ గుమ్మడి కాయలను నైవేద్యంగా నివేదిస్తారు. ఎన్నో ప్రత్యేకతలతో, గొప్ప స్థల పురాణంతో కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయం ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతుంది.

ఆలయ చరిత్ర ఇదే
దక్షయజ్ఞంలో వీరభద్రుడు దక్షుని సంహరించి, ఆపై తపోవనార్దిగా మారి కొత్తకొండ గుట్టపై తపస్సు చేసి స్వయంభువుగా వెలిశారని చరిత్ర చెప్తుంది. క్రీ.శ 1600వ సంవత్సరం కాలంలో, అంటే కాకతీయుల కాలంలో వంటచెరుకు కోసం ఉల్లిగడ్డ దామెర, కడిపికొండకు చెందిన కొందమంది కుమ్మరులు ఎడ్లబండ్లతో కొత్తకొండ వద్ద ఉన్న కొండపైకి వెళ్లారు. వంటచెరుకు దొరికిన తరువాత అలసిపోయిన కుమ్మరులు నిద్రపోయారు. కాసేపటి తరువాత లేచి చూడగా, ఎడ్లు కనబడకపోవడంతో రాత్రి అక్కడే పడుకున్నారు.

kothakonda veerabhadra swamy temple history and speciality of kothakonda jatara

గుట్టపై నుండి క్రిందికి తెచ్చిన ప్రతిష్టించిన కుమ్మరులు
ఆ రాత్రి వారికి వీరభద్రుడు కలలో కనిపించి గుట్టపై నుంచి కిందికి దించి అక్కడ ఆలయంలో ప్రతిష్ఠిస్తే వారి ఎడ్లు దొరుకుతాయిని చెప్పారట..
గుట్టకింద దూదిమెత్తలలో విగ్రహాన్ని ఉంచి, ఆయనను క్రిందికి తెచ్చి వీరభద్రస్వామిని ప్రతిష్ఠించినట్లు, ఈ క్రమంలో స్వామివారి కాలు విరిగినట్లు స్థానికులు తెలుపుతుంటారు. అప్పట్లో కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో మహామ్మాయి దేవత ఉండేది. ఆమెను బయట ప్రతిష్టించి వీరభద్ర స్వామిని లోపల ప్రతిష్టించి అప్పటి నుండి పూజలు చేస్తున్నారు.

కొత్తకొండ జాతర విశేషాలు
కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ళ మధ్య సుందరంగా బంధురంగా నిర్మించబడింది. ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా కొండపై ఐదు కొలనులు నిత్యం నీటితో నిండి ఉండటం వీరభద్రస్వామి మహత్యమే అని గ్రామ ప్రజలు చెప్పుకుంటారు. కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారిన సంక్రాంతి రోజు ఇక్కడ జాతర జరుగుతుంది.

సంక్రాంతి నాడు ఎడ్ల బండ్లతో కుమ్మరుల మొక్కులు
కొత్తకొండ జాతర ప్రాధాన ఆకర్షణ సంక్రాంతి రోజున నేటికీ కుమ్మరులు ఎడ్ల బండ్లలో వచ్చి మొదట మొక్కులు సమర్పిస్తారు. ఆ తర్వాతనే మిగతావారు మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమినాడు 10 రోజులపాటు స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం జనవరి 10న వీరభద్రస్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.

కొత్తకొండ జాతరలో నిత్యం జరిగే కార్యక్రమాలు ఇవే
11న గవ్యాతం, నిత్యోపాసన, నిత్యహోమం, నవగ్రహ హోమాలు, 12న బలిహరణ, సూర్యయంత్ర పతిష్టాపన, అరుణ పారాయణం నిర్వహిస్తారు. 13న ఏకాదశి రుద్రహోమం , 14న భోగిపండుగ రోజున చండీహోమం, వేదపారాయణం, 15న బండ్లు తిరుగుట, శత రుద్రాభిషేకం, ఉత్తరాయణ పుణ్యకాల పూజ, 16న నాగవెల్లి, వసంతోత్సవం, 17న గణపతి పూజ, స్వామివారి త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు అనంతరం స్వామివారి గ్రామ పర్యటన జాతరలో ముఖ్య ఘట్టాలుగా ఉంటాయి.

వీరశైవులు ఖడ్గాలు ధరించి జాతర సమయంలో విన్యాసాలు
ఏటా సంక్రాంతి జాతర సందర్భంగా భక్తులు గండాలు తీరాలని గండదీపం పెడతారు. వీరభద్రునికి వెండి, బంగారంతో చేసిన కోరమీసాలు సమర్పిస్తారు. వీరశైవులు ఖడ్గాలు ధరించి ప్రభలు, బీరభద్రపల్లెరం చేస్తారు. స్వామి వారిని వైశ్యులు వారి ఇలవేల్పుగా పూజిస్తారు. ప్రతి శ్రావణ మాసంలో వందలాది మంది భక్తులు స్వామివారి మాలను ధరించి 27 రోజులు దీక్షలు చేపడతారు.

కోరి కొలిచే వారి కొంగు బంగారంగా వీరభద్రస్వామి
ఇక్కడి వీరభద్రస్వామికి ప్రత్యేక మహిమలు ఉన్నట్లు భక్తుల చాలా బలంగా నమ్ముతారు. కోరి కొలిచే వారి కొంగు బంగారంగా వీరభద్రస్వామి భక్తులను కరుణిస్తారని చెప్తారు. సంతానం లేనివారు స్వామి వారికి కోరమీసాలు సమర్పించుకుంటే పుత్రసంతానం కలుగుతుందని, కోడెను కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చేసిన పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.

పెళ్ళిళ్ళు కానివారు, సంతానం లేనివారు స్వామిని దర్శిస్తే చాలు
ఈ ఆలయానికి ఒక్క తెలంగాణా రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా భక్తులు వస్తారు. స్వామి వారి మహత్యం తెలిసిన వారు కుజ దోషంతో పెళ్ళిళ్ళు కానివారు, సంతానం లేనివారు ఎక్కువగా ఈ ఆలయానికి వచ్చి వీరభద్రుడికి మొక్కితే వారికి కోరిన కోర్కెలు తప్పక తీరుతాయని చెప్తారు. కోర్కెలు తీరిన వారు స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు.

గుమ్మడికాయల నైవేద్యం వెనుక రహస్యం ఇదే
ఇక్కడ రాచ గుమ్మడికాయ మొక్కులకు చాలాపెద్ద చరిత్రే ఉంది. దక్షయజ్ఞంలో దక్షున్ని వీరభద్రుడు సంహరించినట్లు చరిత్ర చెపుతుంది. వీరభద్రుడు కోపాన్ని శాంతింప చేయాలంటే ఎన్నితలలు తెగినా అసాధ్యమే అందుకే పరిహారంగా కూష్మాండం అంటే రాచగుమ్మడి కాయను సమర్పిస్తే వీరభద్రుడు శాంతించి అనుగ్రహిస్తాడనేది నమ్మకం.ఆ నమ్మకంతోనే భక్తులు నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకొని తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జాతర సమయంలో కొత్తకొండ వీరభద్రస్వామి జాతరలో వేలాది రాచగుమ్మడికాయల వ్యాపారం జరుగుతుంది.

దినదిన ప్రవర్ధమానంగా కొత్తకొండ వీరభద్రుని ఆలయం
కోడెలు కట్టటం, కోరమీసాలు సమర్పించటం, రాచ గుమ్మడికాయలను నివేదించటం, అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరాలు, అమ్మ వారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, నవగ్రహ పూజలు, ఆంజనేయునికి ఆకుపూజలు, చందనోత్సవాలు మొదలైనవి భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇక్కడకు నిత్యం వచ్చే భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నారు. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ శైవ క్షేత్రం అయిన కొత్తకొండ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+