వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఏ 'అమ్మ'నో ఇవ్వలేదు: కేటీఆర్ వ్యాఖ్య, సోనియా పైనేనా?

తెలంగాణ రాష్ట్రాన్ని ఏ అమ్మనో ఇవ్వలేదని, ప్రజలు పోరాడి సాధించుకున్నారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏ అమ్మనో ఇవ్వలేదని, ప్రజలు పోరాడి సాధించుకున్నారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం నాడు ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తున్నారు.

మూడేళ్ల క్రితం తెలంగాణ ఇస్తామని, ఇచ్చినప్పుడు ప్రస్తుత సీఎం కేసీఆర్ తన కుటుంబంతో సహా ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారని, అలాగే తెలంగాణ ఇస్తే పార్టీని కూడా కలుపుతామని చెప్పారని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కుటుంబంతో సహా వెళ్లి ధన్యావాదాలు చెప్పారని అంటున్నారు.

KT Rama Rao

ఇప్పుడు మాత్రం ఏ అమ్మ వాళ్లో రాలేదని చెప్పడం ఏమిటని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తెలంగాణ అమ్మ (సోనియా గాంధీ) వల్లే వచ్చిందని కాంగ్రెస్ నేతలు నిత్యం చెబుతుంటారు.

సోమవారం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఏ అమ్మో ఇవ్వలేదన్నారు. మనం పోరాడి సాధించుకున్నామని చెప్పారు. 30 నెలల్లో తెలంగాణ రాష్ట్రం అనేక అడ్డంకుల్ని తట్టుకొని నిలబడిందన్నారు.

కేసీఆర్‌కు, గుత్తాకు ఝలక్: కాంగ్రెస్ పార్టీలోకి వలస, 'తెరాసకు కౌంట్ డౌన్'కేసీఆర్‌కు, గుత్తాకు ఝలక్: కాంగ్రెస్ పార్టీలోకి వలస, 'తెరాసకు కౌంట్ డౌన్'

పరిపాలనలో తెలంగాణ కొత్తపుంతలు తొక్కుతోందన్నారు. తెలంగాణ ఉద్యమం, పరిపాలనలో టీఎన్జీవోల పాత్ర అమోఘమన్నారు. నాలుగో తరగతి ఉద్యోగులు ఏపీలో ఉన్నారనీ, వారిని రప్పించనున్నట్టు చెప్పారు.

English summary
KT Rama Rao interesting comments on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X