వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు-కెసిఆర్‌లే దోస్తులయ్యారు, ఇక కొట్లాటెందుకు: కెటిఆర్, బాబూ! మౌలాలీ రా: కవిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విభజనతో నష్టం జరగలేదని, రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం అన్నారు. మొన్నటిదాకా మాటలతో దాడి చేసుకున్న కేసీఆర్, చంద్రబాబు ఇప్పుడు స్నేహంగా ఉన్నారని, ఇక మనమధ్య తేడాలెందుకని ప్రశ్నించారు.

సోమాజిగూడ, వెంగళరావునగర్‌ డివిజన్ల ఓటర్లతో శ్రీనివాసనగర్‌ కాలనీ సామాజిక భవనంలో మాజీ మంత్రి విజయ రామారావు, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, తదితరులతో కలిసి కేటీఆర్‌ మాట్లాడారు. హైదరాబాద్‌లో సమస్యల పరిష్కారానికి రూ.50వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించామన్నారు.

చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక్కడి సమస్యల పరిష్కారానికి విజయవాడ వెళ్లాలని, టిఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఇక్కడే సీఎం కేసీఆర్‌ను కలిసి పరిష్కరించుకోవచ్చన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఉద్యమ టైంలో పరుషంగా మాట్లాడింది వాస్తవమే కానీ ఎదుటివారిని ఎదుర్కొనేందుకు తప్పలేదన్నారు.

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కావడంతో రెండు ప్రభుత్వాలు పదేళ్లు ఇక్కడే ఉండొచ్చనని, అయితే విజయవాడలో ఉండడాన్నే అక్కడి ప్రజలు స్వాగతిస్తున్నట్లు చంద్రబాబే చెప్పారన్నారు. తెలంగాణ బాగుపడాలని కోరుకున్నాం కానీ ఏపీ చెడిపోవాలని కోరుకోలేదని, అందుకే కృష్ణా డెల్టాలో నారుమళ్లు ఎండిపోతున్నాయని ఎవరో ఫోన్‌ చేస్తే కేసీఆర్‌ స్పందించారన్నారు.

కెటిఆర్

కెటిఆర్

రాష్ట్రంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్‌లో వ్యాపారులకు పూర్తి భద్రత కల్పిస్తామని, వారిపై ఈగ కూడా వాలనీయబోమని మంత్రి కెటి రామారావు చెప్పారు.

కెటిఆర్

కెటిఆర్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ షోల్లో మాట్లాడారు.

కెటిఆర్

కెటిఆర్

స్మార్ట్‌సిటీలను ఏపీకి రెండు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని కెటిఆర్ విమర్శించారు.

కెటిఆర్

కెటిఆర్

ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణకు మొహం చూపించేందుకు సమయం లేదని, బిజెపి నేతలు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని కెటిఆర్ ధ్వజమెత్తారు.

కెటిఆర్

కెటిఆర్

నగరానికి పైసా పని చేయకుండా నిస్సిగ్గుగా ఓట్లు అడుగుతున్నారన్నారని, హైదరాబాద్‌లోమురికివాడల ప్రజల కోసం రూ.600 కోట్ల మంచినీటి, విద్యుత్‌ బిల్లులను మాఫీ చేశామని కెటిఆర్ చెప్పారు.

కెటిఆర్

కెటిఆర్

రెండు పకడగదుల ఇళ్ల నిర్మాణం, ఆసరా పింఛన్ల పంపిణీ చేపట్టామని కెటిఆర్ అన్నారు. టిఆర్ఎస్‌కు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేస్తామన్నారు.

కవిత

కవిత

పేరుకే హైదరాబాద్ అని ఎటు చూసినా పేదల బస్తీలేనని, అరవై ఏళ్లలో ఏ ప్రభుత్వమూ నగరంలోని పేదలను పట్టించుకోలేదని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

కవిత

కవిత

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక అడగకముందే లక్ష మంది పేదలకు పట్టాలిచ్చారని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.

కవిత

కవిత

నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడంతో రూ.50 వేల కోట్ల పెట్టుబడులొచ్చాయని, దాదాపు వెయ్యి సంస్థలు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు.

కవిత

కవిత

అధికారంలోకి వచ్చిన మూణ్నెల్లలోనే 24 గంటలు నిర్విరామంగా కరెంటు ఇచ్చిందీ, ఆడపిల్లలకు రక్షణగా షీ బృందాలను అమల్లోకి తెచ్చింది సీఎం కేసీఆరేనన్నారు.

కవిత

కవిత

రాబోయే నాలుగేళ్లలో లక్ష రెండు పడకగదుల ఇళ్లను కట్టించేందుకు ప్రణాళిక సిద్ధమైందన్నారు. మేయర్‌గా టిఆర్ఎస్ అభ్యర్థి ఉంటేనే నగరం మొత్తం అభివృద్ధి అయ్యేలా చూస్తారన్నారు.

కవిత

కవిత

హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెబుతున్న చంద్రబాబు మౌలాలి వీధుల్లోకి వచ్చి చూడాలన్నారు. పెద్దపెద్ద భవనాలు కట్టి వాటికి రెండు అద్దాలు పెడితే అభివృద్ధి కాదన్నారు.

English summary
Telangana Minister KT Rama Rao questions about Smart Cities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X