మీతోని ఐతలేదు బై
Vice President of India: ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్ది సేపటి కిందటే ఆరంభమైంది. పార్లమెంట్ సభ్యులు 15వ ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటోన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బరిలో దిగారు. ఆయనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిని పోటీకి నిలిపింది ఇండియా బ్లాక్. ఈ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీఏ తరపున మొదట ఆయనే ఓటు వేశారు. ఉదయం సరిగ్గా 10 గంటలకు పార్లమెంట్ హౌస్ కు చేరుకున్నారు. ఆ వెంటనే ఓటు వేశారు. క్రమంగా పలువురు కేంద్రమంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ హౌస్ కు చేరుకుంటోన్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ హౌస్ సందడిగా మారింది.

ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్, బీజేడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ తప్పుపట్టారు. ఈ రెండు పార్టీలు పదేళ్లుగా బీజేపీకి పార్లమెంట్ లో గట్టిగా మద్దతుగా నిలిచాయని విమర్శించారు. లోక్ సభకు జరిగిన రెండు ఎన్నికల్లోనూ మద్దతు ఇచ్చినవేనని ఎద్దేవా చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం.. భవిష్యత్తు పరిణామాలకు సంకేతమా అన్న చర్చ మొదలైంది.. అని చురకలు అంటించారు.
ఈ వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అహంకారం, పెత్తందారీ స్వభావం ఉన్నాయని ఎదురుదాడికి దిగారు. ఈ రెండింటి కారణాల వల్లే సమకాలీన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం అయ్యాయని అన్నారు. సమకాలీన రాజకీయాలను చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మండిపడ్డారు. మీరు మాతో ఉంటే మాతోనే, లేకపోతే మీరు వాళ్లతో ఉన్నట్టు' అనే వాదన దేశాన్ని రెండు వర్గాలుగా విభజించే ప్రయత్నమని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Jairam Ji, This sense of entitlement and arrogance is what made Congress fail in contemporary politics
— KTR (@KTRBRS) September 9, 2025
‘Either you are with us or else you’re with them’ claim is a silly argument posturing as if the nation is bipolar
We are neither B-team of Congress or BJP
We are the A-team… https://t.co/xrIvSE7AeZ
తాము ఏ కాంగ్రెస్ కో లేదా బీజేపీ కో బీ-టీమ్ గా లేమని, తెలంగాణ ప్రజల ఏ-టీమ్ గా ఉన్నామని తేల్చి చెప్పారు. అహంభావాన్ని విడనాడి పార్టీ వైఫల్యాలపై దృష్టి పెట్టడం మంచిదని ఈ సందర్భంగా జైరామ్ రమేష్ కు సూచించారు కేటీఆర్. అనవసరమైన విమర్శలు మానుకోవాలని సూచించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications