మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం - తెలంగాణ కాంగ్రెస్ నేతల ట్వీట్లకు ఇక : రాహుల్ పర్యటన వేళ..!!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ..రాజకీయ విమర్శలు పీక్ కు చేరాయి. రాహుల్ కు తెలంగాణకు మంత్రి కేటీఆర్ స్వాగతం చెబుతూనే...తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్న ఉత్తమ విధానాల అధ్యయనం చేసి..కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తారని పేర్కొన్నారు. దీనికి టీపీసీసీ చీఫ్ సైతం కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా రైతులను మోసం చేసిందో అధ్యయనం చేయాలా అంటూ రేవంత్ ప్రశ్నించారు.
ట్విట్టర్ పిట్ట తోకముడిచింది. ప్రశ్నను చూసి గజగజ వణికింది. ప్రజల తరపున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్ చేశారు. ఒక జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ను బ్లాక్ చేయడం కేటీఆర్ మానసిక స్థితికి అద్దం పడుతోంది. pic.twitter.com/59DzXVQziB
— Telangana Congress (@INCTelangana) May 6, 2022
తెలంగాణలో రైతులకు జరుగుతున్న అన్యాయం..వారికి కాంగ్రెస్ ఏ విధంగా అండగా ఉండేదీ ఈ సభలో రాహుల్ క్లారిటీ ఇస్తారంటూ టీపీసీసీ నేతలు చెబుతున్నారు. ఇక, రేవంత్ వర్సెస్ కవిత మధ్య సైతం ట్వీట్ వార్ పతాక స్థాయికి చేరింది. ఈ సమయంలో మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ లో కేటీఆర్ యాక్టివ్ గా ఉంటారు. రాజకీయ - ప్రభుత్వ పరంగా స్పందిస్తారు. అదే సమయంలో ఎవరైనా ఈ సోషల్ మీడియా వేదిక నుంచి సాయం కోరినా స్పందిస్తారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖాతాను బ్లాక్ చేసారు.

దీని పైన టీపీసీసీ స్పందించింది. ట్విట్టర్ పిట్ట తోకముడిచింది. ప్రశ్నను చూసి గజగజ వణికింది. ప్రజల తరపున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్ చేశారు. ఒక జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ను బ్లాక్ చేయడం కేటీఆర్ మానసిక స్థితికి అద్దం పడుతోంది...అంటూ పోస్టు చేసింది. రాహుల్ తెలంగాణకు వస్తున్న సమయంలో కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ ఎకౌంట్ ను బ్లాక్ చేయటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేటీఆర్ కాంగ్రెస్ ట్విట్టర్ ఎకౌంట్ ను బ్లాక్ చేసారంటూ టీపీసీసీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీని పైన టీఆర్ఎస్ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు వేచి చూడాలి. ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications