కవితకు కేటీఆర్ కౌంటర్.. అంత మాట అన్నారేంటి!
తెలంగాణ రాజకీయాలలో ఫోన్ టాపింగ్ వ్యవహారంతో పాటు, మున్సిపల్ ఎన్నికలు కూడా రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో బి ఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతుంటే, ఈ వ్యవహారంలో తాజాగా కవిత కూడా ఎంటరయ్యారు. మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థి మంచోడు అయినా చెడ్డోడు అయినా కేసీఆర్ గారిని చూసి ఓటు వేయాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.
కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన
ఈ వ్యాఖ్యలపైన కవిత మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను టార్గెట్ చేసిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత వ్యాఖ్యల పైన కేటీఆర్ స్పందిస్తూ కవితపైన బి ఆర్ ఎస్ పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఇక ఆమె గురించి తాను ప్రత్యేకంగా స్పందించవలసిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు.

ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇవ్వవలసిన అవసరం లేదు
రాజకీయాలలో ఎంతో మంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారని, ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇవ్వవలసిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.అంతకుముందు కవిత, కేటీఆర్ మాటలు రాచరిక పోకడలకు, నియంతృత్వానికి నిదర్శనంగా ఉన్నాయని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలలో గుణం చూసి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.
చెడ్డవాళ్లకు ఓటేయాలని కేటీఆర్ ఎలా చెబుతారు అంటూ కవిత టార్గెట్
పనిచేసే వాళ్లకు మంచి అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. చెడ్డవాళ్లకు ఓటేయాలని కేటీఆర్ ఎలా చెబుతారు అంటూ ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపైన పోటీ చేస్తారని కవిత పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలలో పని చేస్తారు అని భావించిన నాయకులకే ఓటు వేసి గెలిపించాలని కవిత విజ్ఞప్తి చేశారు.
కవిత వర్సెస్ కేటీఆర్.. ముదురుతున్న వార్
కవిత వర్సెస్ కేటీఆర్ పొలిటికల్ వార్ ముదురుతున్న క్రమంలో మున్సిపల్ ఎన్నికల వేళ వీరి మధ్య ఇంకా ఎంత మాటల యుద్ధం జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా అన్నా, చెల్లెళ్ళ మధ్య కొనసాగుతున్న వార్ నేపధ్యంలో ఇది కాంగ్రెస్, బీజేపీలకు బెనిఫిట్ గా మారుతుందా అన్నది కూడా ఆసక్తిని కలిగిస్తుంది.
-
కేసీఆర్ కు కవిత బిగ్ షాక్.. గులాబీ పార్టీ మూలాలపై గురి! -
"ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల దోపిడీ..పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం" -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ ! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications