అది ‘స్కాంగ్రెస్’, బాబుకు బుక్ పంపిస్తా: కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేరును స్కాంగ్రెస్ అని మార్చుకుంటే సరిగ్గా సరిపోతుందని సూచించారు. భూగర్భంలో లభించే బొగ్గు మొదలుకొని ఆకాశంలోని అగస్టా హెలికాఫ్టర్ల వరకు అన్ని కుంభకోణాల్లో కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని అన్నారు.
తామింకా రాజకీయాల్లో ఉన్నామూ అని చెప్పుకోవడానికి దిగ్విజయ్‌సింగ్‌లాంటి నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆధారాలతో ఆరోపణలు చేస్తే సమంజసంగా ఉంటుందని అన్నారు. వాటర్ గ్రిడ్ పథకంలో పైపులు కొనేందుకే ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి చూపుతోందని, ఇదో కుంభకోణం అని దిగ్విజయ్ సింగ్ విమర్శించడాన్ని తప్పు పట్టారు. పైపులతో కాకుండా ఇంటింటికి నీటిని సరఫరా చేసే విధానం ఏదైనా ఉంటే దిగ్విజయ్‌సింగ్ చెప్పాలని ప్రశ్నించారు.
స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచి పోయినా ఇంకా ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించలేకపోతున్నామంటే కాంగ్రెస్ ఇంత కాలం దేశాన్ని ఎలా పాలించిందో అర్ధమవుతోందని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పాపం కాంగ్రెస్ పాలకులదేనని అన్నారు. భూగర్భ జలాలను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన మంచినీటిని అందించడానికి వాటర్‌గ్రిడ్‌ను ప్రారంభించినట్టు చెప్పారు.

కెటిఆర్
కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కెటిఆర్
శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేరును స్కాంగ్రెస్ అని మార్చుకుంటే సరిగ్గా సరిపోతుందని సూచించారు.

కెటిఆర్
భూగర్భంలో లభించే బొగ్గు మొదలుకొని ఆకాశంలోని అగస్టా హెలికాఫ్టర్ల వరకు అన్ని కుంభకోణాల్లో కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని అన్నారు.

కెటిఆర్
తామింకా రాజకీయాల్లో ఉన్నామూ అని చెప్పుకోవడానికి దిగ్విజయ్‌సింగ్‌లాంటి నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆధారాలతో ఆరోపణలు చేస్తే సమంజసంగా ఉంటుందని అన్నారు.
కుటుంబ పాలన అంటూ దిగ్విజయ్‌సింగ్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మోతీలాల్ నెహ్రూ వారసునిగా జవహర్‌లాల్ నెహ్రూ రాజకీయాల్లోకి వచ్చారు, నెహ్రూ కుమార్తెగా ఇందిరాగాంధీ, ఆమె కుమారుడిగా రాజీవ్‌గాంధీ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ప్రస్తుతం కూడా ఆ కుటుంబంలోని వ్యక్తుల నాయకత్వంలోనే ఉన్న పార్టీలో కొనసాగుతున్న దిగ్విజయ్‌సింగ్ కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే తాము రాజకీయాల్లోకి వచ్చామని కెటిఆర్ తెలిపారు.
బాబుకు బుక్స్ పంపిస్తా
తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడూ రెవెన్యూ మిగులు రాష్టమ్రేనని, ఇప్పుడూ మిగులు రాష్టమ్రేనని అన్నారు. తన పాలన వల్లనే తెలంగాణ మిగులు రాష్ట్రంగా మారిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు బాబు పుట్టారో లేదో తెలియదు కానీ, 1948లో హైదరాబాద్ మిగులు రాష్ట్రంగా ఉందని తెలిపారు.
1967 లో ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు బిపిఆర్ విఠల్ హైదరాబాద్ మిగులు రాష్ట్రం అంటూ ఇంగ్లీష్‌లో ఒక పుస్తకం రాశారని, 2001లో సైతం ఇప్పటికీ మిగులు రాష్ట్రమే అని రాశారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ రెవెన్యూ మిగులు గురించి తాజాగా వ్యాసాలు వచ్చాయని, ఆ రెండు పుస్తకాల్లోని అంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసి పంపిస్తానని, చంద్రబాబు వాటిని చదువుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications