వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్, గ్లోబరీనా .. మధ్యలో పెద్దమ్మ తల్లి .. భలే ఫిట్టింగ్ పెట్టావు కాకా !

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ. హన్మంతరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థ గురించి తనకు తెలీదన్న ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పెద్దమ్మ గుడిలో ప్రమాణం చెయ్యాలని ఒకవేళ చెయ్యకుంటే కేటీఆర్ తప్పు చేసినట్టేనని సంచలన వ్యాఖ్యలు చేశారు వీహెచ్ . ఇక ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు పెద్దమ్మ గుడికి రావాలని , అక్కడ అమ్మవారి మీద ప్రమాణం చెయ్యాలని సవాల్ విసిరిన వీహెచ్ పెద్దమ్మ గుడిలో కేటీఆర్ కోసం వెయిట్ చేశారు .

<strong>వర్మకు జగన్ మద్దతుపై ఫైర్ అయిన యామిని, దివ్య వాణి... వర్మ సైకో , బూతు డైరెక్టర్ అని మండిపాటు </strong>వర్మకు జగన్ మద్దతుపై ఫైర్ అయిన యామిని, దివ్య వాణి... వర్మ సైకో , బూతు డైరెక్టర్ అని మండిపాటు

పెద్దమ్మ తల్లిపై ఒట్టేసి చెప్పు ... గ్లోబరీనా తెలీదని .. కేటీఆర్ కు సవాల్

పెద్దమ్మ తల్లిపై ఒట్టేసి చెప్పు ... గ్లోబరీనా తెలీదని .. కేటీఆర్ కు సవాల్

తాను ఇంతవరకు గ్లోబరీనా పేరే వినలేదని కేటీఆర్ చెప్పడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. గ్లోబరీనా కంపెనీ పేరు వినలేదని కేటీఆర్ చెప్పడం కచ్చితంగా పచ్చి అబద్ధమని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే పెద్దమ్మ తల్లిపై ప్రమాణం చేసి గ్లోబరినా తనకు తెలియదని చెప్పాలని సవాల్ విసిరారు.

కేటీఆర్ కోసం పెద్దమ్మ గుడిలో వెయిట్ చేసిన వీహెచ్ .. పెద్దమ్మ గుడికి రాని కేటీఆర్

కేటీఆర్ కోసం పెద్దమ్మ గుడిలో వెయిట్ చేసిన వీహెచ్ .. పెద్దమ్మ గుడికి రాని కేటీఆర్

నేడు , మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆయన వేచి చూశారు. అయితే ఎంతకీ కేటీఆర్ రాకపోవడంతో హనుమంతరావు మండిపడ్డారు. విద్యార్ధులకు జరిగిన అన్యాయాన్ని అమ్మవారి దృష్టికి తీసుకువెళుతూ ప్రభుత్వంపై శాపనార్ధాలు పెట్టారు.రెండేళ్ల లోపే ప్రభుత్వం కూలిపోతుందని, విద్యార్ధులకు అన్యాయం తలపెట్టినవారెవరు బాగుపడరని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లు ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు గ్లోబరీనా అనే సంస్థ గురించి తెలియదా అని హనుమంతరావు నిలదీశారు.

 కేటీఆర్ కు గ్లోబరీనా సంస్థతో సంబంధం ఉంది అన్న వీహెచ్ .. శాపనార్ధాలు

కేటీఆర్ కు గ్లోబరీనా సంస్థతో సంబంధం ఉంది అన్న వీహెచ్ .. శాపనార్ధాలు

కేటీఆర్ పెద్దమ్మ గుడికి రాకపోవడంతో ఆ కంపెనీతో ఆయనకున్న అనుబంధం నిజమని తేలిపోయిందన్నారు. కాగా, గ్లోబరీనా సంస్థతో తనకెలాంటి సంబంధం లేదని హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో మంగళవారం మధ్యాహ్నం లోపు ప్రమాణం చేయాలని కేటీఆర్‌కు వీహెచ్ సవాల్ విసిరిన వీహెచ్ ఆ విధంగా చేయలేదు కాబట్టి కేటీఆర్ కు గ్లోబరీనా సంస్థతో ఒప్పందం ఉన్నమాట నిజమే అని ఒప్పుకున్నట్టే" అని స్పష్టం చేశారు. ఇక ఇదంతా చూస్తున్నవారు కేటీఆర్, గ్లోబరీనా .. మధ్యలో పెద్దమ్మ తల్లి .. భలే ఫిట్టింగ్ పెట్టావు కాకా అని వీహెచ్ ఛాలెంజ్ పై చర్చలు పెడుతున్నారు.

English summary
Telangana Congress leader V. Hanumantharao has reacted strongly to the deaths of 23 students today due to irregularities in the Telangana Inter-board Board. He asked to take action on Globareena . KTR said that he don't know about Globareena . V.H challenged to KTR At 12 o'clock, you come to the peddamma temple ... and if you really don't know Globareena promise on goddess V.H said . V.H waited at peddamma temple for KTR and KTR didn't come to the temple. V.H waited for half an hour for KTR and cursed on the government and KTR .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X