పొగడ్తల వర్షం: బావా నువ్వు సూపర్‌ అన్న కేటీఆర్, కేటీఆర్ ను ఆకాశానికెత్తేసిన హరీష్ రావు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ మంత్రులు, బావా బావమరుదులైన కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీశ్‌ రావు పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన వైద్యోపకరణాల పార్కు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది.

ప్రారంభోత్సవం తరువాత మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి మంత్రి కేటీఆర్‌ అనేక విధాలుగా కృషి చేస్తున్నారని.. అసలు ఆయన పరిశ్రమల మంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని ప్రశంసించారు.

కేటీఆర్‌ దార్శనికత వల్లే రాష్ట్రం పారిశ్రామిక రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని, ఒకేరోజు సుల్తాన్‌పూర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 14 పరిశ్రమలు ఒప్పందాలు చేసుకున్నాయంటే.. అందుకు కేటీఆర్‌ చేస్తున్న నిరంతర శ్రమే కారణమంటూ హరీష్ రావు పొగడ్తల వర్షం కురిపించారు.

KTR, Harish Rao Laud each other Launch Medical Devices Park

తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక అనుమానాలు వ్యక్తం చేసిన వారే ఇప్పుడు ఆశ్చర్యపడేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు. ఇక ఆ తర్వాత మాట్లాడిన కేటీఆర్‌ కూడా హరీశ్‌ను ఆకాశానికెత్తేశారు.

కరువును పారద్రోలి తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి 24 గంటలు శ్రమిస్తున్న గౌరవనీయులైన పెద్దలు హరీశ్‌ రావు గారు.. అంటూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు.

మెడికల్‌ డివైజెస్‌ పార్కు, ఎల్‌ఈడీ పార్కులకు భూసేకరణ విషయంలో హరీశ్‌ చాలా కష్టపడ్డారని, అధికారులపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చి సకాలంలో స్థలాలు అందేలా చూశారంటూ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After inaguaration of Medical Devices Park Minister T Harish Rao today praised IT & Industries Minister KTR for rapid development of IT sector and exports reaching its peak. Speaking on the occassion, Harish Rao was all praise for KTR. After that while giving speach Minister KTR also praised Harish Rao
Please Wait while comments are loading...