హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగార్జునసాగర్ సుంకిశాలలో ఇన్‌టెక్ వెల్ పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్.. ఏం చెప్పారంటే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో నేడు అమిత్ షా సభ, కేటీఆర్ సభలతో రాజకీయం రసవత్తరంగా మారింది. రానున్న ఎన్నికలు టార్గెట్ గా ఇప్పటి నుండే అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజా క్షేత్రంలోకి దూకుడుగా వెళ్తున్నాయి. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో జనం గోస బిజెపి భరోసా పేరుతో రెండవ దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా అమిత్ షా పర్యటించనున్నారు. తుక్కుగూడ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణా రాజకీయాలపై సంచలన ప్రకటనలు చేయ్యనున్నారని సమాచారం.

మంత్రి కేటీఆర్ సాగర్ పర్యటన..ఇన్‌టెక్ వెల్ పనులకు శంకుస్థాపన

ఇదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం నాడు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ సభను సక్సెస్ చెయ్యాలని భావిస్తున్నారు. ఇక మంత్రి కేటీఆర్ షెడ్యూల్ చూస్తే ఉదయం 9 గంటల 45 నిమిషాలకు పెద్దవూర మండలం సుంకిశాల కు మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. హైదరాబాదు తాగునీటి సరఫరా కోసం సుంకిశాల వద్ద జలమండలి నిర్మించనున్న ఇన్ టెక్ వెల్ పంపింగ్ స్టేషన్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

2072 వరకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందుచూపుతో ప్రణాళికలు

2072 వరకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందుచూపుతో ప్రణాళికలు

అనంతరం సమావేశంలో మాట్లాడిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరానికి 2072 వరకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. వరుసగా ఏడు కరువు వచ్చిన తాగునీటి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం 100 కిలోమీటర్లు విస్తరించినా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద సుంకిశాల ఇన్ టెక్ వెల్ పనులకు శంకుస్థాపన చేసిన క్రమంలో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ తాగునీటి కష్టాలు తీరతాయన్న మంత్రి

హైదరాబాద్ తాగునీటి కష్టాలు తీరతాయన్న మంత్రి


హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలకు నిజంగా ఈరోజు శుభదినం అని పేర్కొన్న మంత్రి, మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు ఆధ్వర్యంలో 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. 1450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సుంకిశాలలో తాగునీటి అవసరాల నిమిత్తం పంపులు, మోటార్ల తోపాటు అదనంగా 16 టీఎంసీల లిఫ్ట్ చేయడానికి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు . రాబోయే ఎండా కాలం నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్

పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్

ఆపై ఉదయం 10 గంటల 45 నిమిషాలకు నందికొండ మున్సిపాలిటీకి చేరుకొని అక్కడ జరుగుతున్న బుద్ధవనం ప్రాజెక్టు పనులను పరిశీలించి, మధ్యాహ్నం 12 గంటలకు హాలియా, నందికొండ మునిసిపాలిటీ లకు సంబంధించిన యాభై ఆరు కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు నిర్వహిస్తున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు బయలుదేరుతారు.

అమిత్ షా సభకు పోటీగా కేటీఆర్ సభ.. ఏం జరుగుతుందో!!

అమిత్ షా సభకు పోటీగా కేటీఆర్ సభ.. ఏం జరుగుతుందో!!

ఇక తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్ షా సభలో పాల్గొనడానికి వస్తుండగా, మంత్రి కేటీఆర్ కూడా భారీగా పోటాపోటీ సభను నిర్వహించడం రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేడు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ కేంద్ర సర్కార్ పై ఏం మాట్లాడ బోతున్నారు. అమిత్ షా ను ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నారు అన్న ఉత్కంఠ అందరిలోనూ వ్యక్తమవుతోంది.

English summary
KTR laid the foundation stone for the in-tech well works at Nagarjunasagar Sunkisala, said telangana govt was planning ahead for drinking water without any problems upto 2072 in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X