కేటీఆర్ ఆఫర్, సూపర్! తెలంగాణకు వస్తా: మలేషియా ప్రధాని

హైదరాబాద్: తెలంగాణలో మలేషియా పారిశ్రామికవేత్తల కోసం పార్క్ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీ రామారావు తెలిపారు. చిన్న పరిశ్రమలతో ఉమ్మడి భాగస్వామ్య సంస్థల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కెటిఆర్ అన్నారు.

విదేశీ పర్యటనలో భాగంగా మలేసియాలో ఆ దేశ మౌలిక వసతుల శాఖ మంత్రి దాటోసెరి సామీ వెల్లుతో గురువారం కేటీఆర్‌ భేటీ అయ్యారు. భారత్‌లోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెలంగాణలో అమల్లో ఉందని తెలిపారు. తయారీ, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, ఆటోమొబైల్‌ రంగాల్లో పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం అనుకూలమన్నారు.

త్వరలో మలేసియా ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని తెలంగాణకు పంపించాలని కోరారు. మలేసియా మంత్రి సామీ మాట్లాడుతూ.. తెలంగాణలో చేపట్టిన రెండు పడకగదుల నిర్మాణంలో తమ ప్రభుత్వం పాలు పంచుకుంటుందన్నారు. కేటీఆర్‌ ప్రతిపాదనలపై సానుకూలత వ్యక్తం చేశారు.

కేటీఆర్ మలేషియా ప్రధాని నజీబ్ రజాక్‌ను గురువారం రాత్రి కలిశారు. ఆయనతో గంటకు పైగా సమావేశమయ్యారు. భారత్‌లో తెలంగాణ కొత్త రాష్ట్రమని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంతో అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని, అత్యుత్తమ పారిశ్రామిక విధానం, వినూత్న పథకాలను చేపట్టినట్లు తెలిపారు.

మలేషియాలో కేటీఆర్

మలేషియాలో కేటీఆర్

తెలంగాణలోని పథకాలు, విధానాల గురించి వివరాలను అడిగి తెలుసుకున్న మలేసియా ప్రధాని రజాక్‌ తాను వచ్చే ఏడాది తెలంగాణలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.

మలేషియాలో కేటీఆర్

మలేషియాలో కేటీఆర్

ఇప్పటికే రాష్ట్రంలో అనేక మలేసియా కంపెనీలున్నాయని, మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులకు కొత్త సంస్థలను ప్రోత్సహిస్తామని, తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామన్నారు.

మలేషియాలో కేటీఆర్

మలేషియాలో కేటీఆర్

తెలంగాణ చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇల్ల నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకునేందుకు మలేషియా ప్రభుత్వం ఆసక్తి కనబరిచింది. పలు ఇతర రంగాల్లో పరస్పర సహకారం కోసం ఒక ట్రేడ్ సెంటర్‌ను ప్రారంభించాలని కోరింది. అలాగే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) తో కలిసి పని చేసేందుకు కౌలాలంపూర్ రీజినల్ సెంటర్ ఫర్ ఆర్బివూటేషన్ ఆసక్తిని వ్యక్తం చేసింది.

మలేషియాలో కేటీఆర్

మలేషియాలో కేటీఆర్

తెలంగాణలో ఎల్‌ఈడీ పరిక్షిశమల ఏర్పాటుకు మలేషియా కంపెనీలు ప్రతిపాదించాయి. మంత్రి కేటీ రామారావు గురువారం మలేషియాలో పర్యటించారు.

మలేషియాలో కేటీఆర్

మలేషియాలో కేటీఆర్

ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ ప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించిన ఆయన సాయంత్రం మలేషియా ప్రధాని నజీబ్ రజాక్‌తో గంటకు పైగా సమావేశమయ్యారు.

మలేషియాలో కేటీఆర్

మలేషియాలో కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. మరోవైపు కౌలాలంపూర్‌లో మలేషియా మౌలిక వసతుల క్యాబినెట్ మంత్రి డాటో సెరి సామి వెల్లుతో కూడా సమావేశమై పరస్పర ప్రయోజనమున్న పలు అంశాల మీద చర్చించారు.

మలేషియాలో కేటీఆర్

మలేషియాలో కేటీఆర్

ఏసియన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో 20 కంపెనీలకు చెందిన ప్రతినిధులతో, మలేషియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన డిన్నర్ సమావేశంలో సుమారు 70 మంది సీఈవోలతో, ప్రముఖ మౌలిక రంగ సంస్థ ఎమ్మార్‌సీబీ సంస్థ ప్రతినిధులతో కూడా మంత్రి భేటీ అయ్యారు.

మలేషియాలో కేటీఆర్

మలేషియాలో కేటీఆర్

మంత్రి డాటో సెరి సామి వెల్లుతో జరిపిన సమావేశంలో తెలంగాణ-మలేషియా ప్రభుత్వాలు కలిసి పని చేసేందుకు ఉన్న అవకాశాలను వివరించారు.

మలేషియాలో కేటీఆర్

మలేషియాలో కేటీఆర్

మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఆటో మొబైల్ రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించారు. అధ్యయనం కోసం మలేసియా ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని తెలంగాణకు పంపాలన్నారు. మలేషియన్ కంపెనీల కోసం ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+