నిధులు కోరాం: స్మృతి ఇరానీతో కేటీఆర్ భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంటల తారక రామారావు మంగళవారం కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. ఆమెతో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో చేనేత సమస్యలపై ఆమెతో చర్చించినట్లు తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలను ఆమెకు వివరించామన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుందని చెప్పామన్నారు. రాష్ట్రానికి కొత్తగా క్లస్టర్లు ఇవ్వాలని కోరామన్నారు.

KTR meets Smriti Irani over Handloom Sector development in Telangana

వీటి వల్ల ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. మరమగ్గాల ఆధునికీకరణకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. ఎనిమిది వేల మరమగ్గాల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరినట్లు తెలిపారు. ఇందుకు స్మృతి సానుకూలంగా స్పందించారన్నారు. నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం రూ.12 వందల కోట్లతో ప్రారంభించిన పథకాల గురించి వివరించామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+