Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

KTR on Kavitha's Clean Chit : కవితకు క్లీన్ చిట్ -కేటీఆర్ రియాక్షన్ ఇదే..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐదేళ్లుగా దీనిపై రచ్చ చేస్తున్న సీబీఐకి ఢిల్లీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సీబీఐ నిందితులుగా చేర్చి జైళ్లకు సైతం పంపిన కేజ్రివాల్, మనీష్ సిసోడియా, కవిత (Kavitha)సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో వీరిపై అభియోగాలన్నీ వీగిపోయి క్లీన్ చిట్ లభించినట్లయింది. ఈ నేపథ్యంలో కవిత సోదరుడు, బీఆర్ఎస్ నేత కేటీఆర్ (ktr) స్పందించారు.

కేజ్రీవాల్ నిర్దోషి, కవితకు భారీ ఊరట. లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్
కేజ్రీవాల్ నిర్దోషి, కవితకు భారీ ఊరట. లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్

ఢిల్లీ కోర్టు తీర్పు, కవితకు క్లీట్ పై స్పందిస్తూ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని మద్యం కుంభకోణం పేరుతో కూల్చివేశారు. అలాగే ఈ వ్యవహారంలో అసెంబ్లీ & పార్లమెంట్ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి రాజకీయ బాధితురాలిగా మారిందన్నారు. అలాగే కవిత గారు ఈరోజు కోర్టులో న్యాయం పొందారు. అదే విధంగా, మా నాయకులపై నమోదైన ప్రతి కేసు తప్పుడు, రాజకీయ ప్రేరేపిత మరియు కల్పితమైనదని నిశ్చయంగా బహిర్గతమవుతుందన్నారు.

KTR on Kavitha s Clean Chit in delhi liquor case says justice will prevail
ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పుపై భావోద్వేగానికి గురైన కవిత.. షాకింగ్ వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పుపై భావోద్వేగానికి గురైన కవిత.. షాకింగ్ వ్యాఖ్యలు

ఆ నిజం గెలవనంత వరకు, కాంగ్రెస్, బిజెపి నుండి నిర్లక్ష్యపు ఆరోపణలను మనం చూస్తూనే ఉంటామన్నారు. వీటిని దుర్వినియోగం చేయడానికి, తప్పుదారి పట్టించడానికి రూపొందించిన మీడియా విచారణల్ని చూస్తున్నామన్నారు. దురదృష్టవశాత్తు, ఇది ఇప్పుడు "న్యూ ఇండియా"లో కొత్త ప్రమాణంగా మారిందన్నారు. ఇక్కడ ఆరోపణలు సాక్ష్యాలను భర్తీ చేస్తాయని, మీడియా కథనాలు మిగిలిన ప్రక్రియను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తాయని కేటీఆర్ తెలిపారు. కానీ చివరికి, న్యాయం గెలుస్తుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+