ఆ స్టార్ నటనకు ఫిదా అయిన కేటీఆర్ .. ఏమన్నారో తెలుసా

Recommended Video

    KTR Review On KGF Movie | Filmibeat Telugu

    సీఎం కేసీఆర్ తనయుడు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కు సినిమాలంటే ఎనలేని ఆసక్తి. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఆయన సినిమాల పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తారు. తన మనసుకు నచ్చిన సినిమాలపై తనదైన శైలిలో స్పందిస్తారు. ప్రతిరోజు ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉండే కేటీఆర్ అటు రాజకీయాల్లోనే కాదు, ఇటు సామాజికంగానూ, సినీ పరిజ్ఞానంలోనూ ఆయనకు ఆయనే సాటి. తాజాగా ట్విట్టర్లో ఒక సినీ హీరో పై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.
    కేటీఆర్ సినిమా ప్రియుడనే సంగ‌తి అందరికీ తెలిసిందే.

    ఆయన ఖాళీ సమయాల్లో సినిమాలు చూస్తూ, వాటి గురించి ట్విట‌ర్ ద్వారా స్పందిస్తుంటారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల‌తో బిజీ అయిపోయి సినిమాలు చూడ‌లేక‌పోయిన‌ కేటీఆర్ తాజాగా ఓ సినిమా గురించి ట్వీట్ చేశారు. ద‌క్షిణాదిన బాహుబ‌లి త‌ర్వాత ఆ స్థాయి భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మై ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం కేజీఎఫ్‌. క‌న్న‌డ రాక్ స్టార్ య‌ష్ న‌టించిన ఈ సినిమా ద‌క్షిణాది భాష‌లన్నింటిలోనూ విడుద‌లై విజ‌యం సాధించింది. తాజాగా ఈ సినిమా చూసిన కేటీఆర్ ట్విట‌ర్ ద్వారా చిత్ర‌బృందాన్ని ప్రశంసించారు.

    KTR praised the stars performance ..Do you know what he said

    కొద్దిగా ఆల‌స్యంగానే అయినా ఎట్ట‌కేల‌కు కేజీఎఫ్‌ చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. సాంకేతికంగా, క‌థాప‌రంగా చాలా బాగుంది. మంచి పట్టు స్క్రీన్ ప్లే లో ఉంది. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ సినిమాను అద్భుతంగా రూపొందించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. స్క్రీన్‌ఫై రాక్‌స్టార్ య‌ష్ న‌ట‌న అదిరిపోయింద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

    ఒకపక్క రానున్న లోక్ సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూనే కేటీఆర్ సినిమాపై ట్వీట్ చేయడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. అటు రాజకీయాలను, ఇటు సామాజిక అంశాలను, మరోవైపు సినిమాలను సైతం కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసే కేటీఆర్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+