చాలా బాగా చేశారు: హరీశ్ రావును ప్రశంసించిన కెటిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: గనుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మెరుగైన చర్యలు చేపట్టి 45శాతం ఆదాయాన్ని పెంచారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ప్రశంసించారు. ఈ ఏడాది రెట్టింపు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఇసుక కొరత రావొద్దు: ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష
తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు 72 లక్షల ఘనపు మీటర్ల ఇసుక అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు అవసరమైన ఇసుక రీచ్‌లను గుర్తించాలని తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ సూచించారు. శనివారమిక్కడ సచివాలయంలో నీటిపారుదల, గనులశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లకు రెండురోజుల్లో మ్యాపింగ్ పూర్తిచేసి, ప్రాజెక్టులకు సమీపంలో వనరులను గుర్తించాలని ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగ నుంచి కరీంనగర్ జిల్లాలోని గౌరవల్లి, గండిపల్లి, వరంగల్ జిల్లా దేవాదుల, నల్గొండ ఎంఎంఆర్‌పీ, పెండ్లిపాకల, ఉదయ సముద్రం, డిండి ప్రాజెక్టులు, ప్రాజెక్టుల పునరాకృతిలో చేపట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం తదితర ప్రాజెక్టులకు 72 లక్షల ఘనపు మీటర్ల ఇసుక అవసరమన్నారు.
మిడ్‌మానేరులో ఈఏడాది 3టీఎంసీల నీటినినిల్వ చేసేందుకు అందులోని ఇసుకను ప్రాజెక్టులకు తరలించాలని సూచించారు. కాళేశ్వరం ప్యాకేజీ-9, రంగనాయకి సాగర్, అనంతగిరి ప్రాజెక్టులకు మిడ్‌మానేరు నుంచి ఏడు లక్షల ఘనపు మీటర్ల ఇసుకను 45 రోజుల్లో తరలించాలని లక్ష్యంగా పెట్టారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, గనులశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, నీటిపారుదలకార్యదర్శి వికాస్‌రాజ్, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఇలంబర్తి పాల్గొన్నారు.
మొక్కలు నాటితేనే నిర్మాణాలకు అనుమతి
మొక్కలు నాటితేనే భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చేలా నిబంధనల్లో మార్పులు చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ విధానాన్ని అన్ని మున్సిపాలిటీల్లో, నగరపాలికల్లో అమలు చేయాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 నర్సరీలు నెలకొల్పనున్నటు,్ల వాటి ద్వారా ప్రజలకు మొక్కలు సరఫరా చేయాలని అధికారులను కోరారు.

హరీశ్-కెటిఆర్ సమీక్ష
గనుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మెరుగైన చర్యలు చేపట్టి 45శాతం ఆదాయాన్ని పెంచారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ప్రశంసించారు.

కెటిఆర్-హరీశ్
ఈ ఏడాది రెట్టింపు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

కెటిఆర్ సమీక్ష
తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు 72 లక్షల ఘనపు మీటర్ల ఇసుక అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు అవసరమైన ఇసుక రీచ్‌లను గుర్తించాలని తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ సూచించారు.

కెటిఆర్ సమీక్ష
శనివారమిక్కడ సచివాలయంలో నీటిపారుదల, గనులశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లకు రెండురోజుల్లో మ్యాపింగ్ పూర్తిచేసి, ప్రాజెక్టులకు సమీపంలో వనరులను గుర్తించాలని ఆదేశించారు.

కెటిఆర్ సమీక్ష
ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగ నుంచి కరీంనగర్ జిల్లాలోని గౌరవల్లి, గండిపల్లి, వరంగల్ జిల్లా దేవాదుల, నల్గొండ ఎంఎంఆర్‌పీ, పెండ్లిపాకల, ఉదయ సముద్రం, డిండి ప్రాజెక్టులు, ప్రాజెక్టుల పునరాకృతిలో చేపట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం తదితర ప్రాజెక్టులకు 72 లక్షల ఘనపు మీటర్ల ఇసుక అవసరమన్నారు.

కెటిఆర్ సమీక్ష
మిడ్‌మానేరులో ఈఏడాది 3టీఎంసీల నీటినినిల్వ చేసేందుకు అందులోని ఇసుకను ప్రాజెక్టులకు తరలించాలని సూచించారు. కాళేశ్వరం ప్యాకేజీ-9, రంగనాయకి సాగర్, అనంతగిరి ప్రాజెక్టులకు మిడ్‌మానేరు నుంచి ఏడు లక్షల ఘనపు మీటర్ల ఇసుకను 45 రోజుల్లో తరలించాలని లక్ష్యంగా పెట్టారు.












Click it and Unblock the Notifications