తెలంగాణలో మహిళలకు స్కూటీలు.. ఎప్పుడో చెప్పాలి: కేటీఆర్

ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని మహిళలకు స్కూటీలు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని.. తెలంగాణలో మహిళలకు స్కూటీలు ఎప్పుడిస్తారో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అందాల పోటీలు ఆపేసి.. ఆ నిధుల‌తో అమ్మాయిల‌కు స్కూటీలు ఇవ్వాలని సూచించారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెర‌వేర్చ‌లేద‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. ఈ మేరకు అసెంబ్లీలో పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్.

KTR Questions CM Revanth Reddy on Scooty Scheme for Women in Telangana

"విద్యపైన బడ్జెట్ లో 15 శాతం అని ఏడున్న‌ర శాతం పెట్టారు. విద్యా భ‌రోసా కార్డు ఇస్తాం అన్నారు. పిల్ల‌లు ఫీజు క‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో బాధ‌ప‌డుతున్నారు. ముందు గురుకులాలను కాపాడండి. అద్దె చెల్లించ‌క గురుకులాలు మూత‌బ‌డుతున్నాయి. ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు 1800 కోట్లు ఉంటే క‌ట్టాం. ఇప్పుడు 8 వేల కోట్లు ఉన్నాయి.. వాటిని చెల్లించాల‌ని కోరుతున్నాం.అందాల పోటీలు మానేసీ స్కూటీలు ఇవ్వండి.. 500 కోట్లు పెడితే కొంద‌రికైనా స్కూటీలు వ‌స్తాయి" అని కేటీఆర్ పేర్కొన్నారు.

పీఎం, సీఎం పచ్చి అబద్ధాలు..

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడట్లేదని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి పనిలో గత ప్రభుత్వమని తమని విమర్శిస్తున్నారు కానీ.. కేంద్రంపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు కేంద్రం ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా..? అని ప్రశ్నించారు. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని, కుంభమేళాకు కేంద్రం నిధులు ఇస్తుందని.. సమ్మక సారలమ్మ జాతరకు ఎందుకు నిధులు ఇవ్వరని ప్రశ్నించారు. మనం అడగకపోతే కేంద్రం నిధులు ఇవ్వదని తెలిపారు.

Take a Poll

తెలంగాణ 1 ట్రిలియల్‌ ఎకానిమీ కావాలంటే ప్రస్తుత ధరల ప్రకరాం 35 ఏళ్లు పడుతుందని, పీఎం రెండు కోట్ల ఉద్యోగాలు, సీఎం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని గుర్తు చేశారు. పీఎం, సీఎం పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, కేంద్రంతో సఖ్యత వల్ల రేవంత్‌రెడ్డి ఏం సాధించారని నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+