రేవంత్ రెడ్డి ఓ చిట్టినాయుడు.. కేటీఆర్ ర్యాగింగ్, సాలిడ్ వార్నింగ్!

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పైన మాటల దాడిని పెంచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఊహించని విధంగా నేడు మాటల దాడి చేశారు. ఈరోజు పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రేవంత్ రెడ్డి పరువు తీసేశారు. ఒక ముఖ్యమంత్రి అన్న విషయం మరచి ఆయనపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు.

చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చి పోయారు
చరిత్రలో రేవంత్ రెడ్డి లాంటి సీఎంలను చాలామందిని చూశామని పేర్కొన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ఓ చిట్టి నాయుడు అంటూ ఎద్దేవా చేశారు. తాము చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారితోనే కొట్లాడామని వారి కింద రేవంత్ రెడ్డి ఎంత అంటూ రేవంత్ రెడ్డిని తీసిపారేశారు. చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తల మాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చారని మస్తుగా పోయారని పేర్కొన్నారు కేటీఆర్.

KTR ragging on cm revanth reddy said revanth as chitti naidu

రేవంత్ రెడ్డి ఓ చిట్టి నాయుడు
ఎంతో పెద్దపెద్ద వాళ్లతోనే తాము కొట్లాడామని గుర్తు చేశారు. చంద్రబాబుతో, రాజశేఖర్ రెడ్డి తో, కిరణ్ కుమార్ రెడ్డితో, రోశయ్యతో కొట్లాడామని పేర్కొన్న కేటీఆర్ ఆఫ్ట్రాల్ నువ్వెంత అంటూ టార్గెట్ చేశారు. వాళ్ళందరి కంటే నువ్వు చాలా చిన్నోడివి. నువ్వు చిట్టి నాయుడువి అంటూ రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు.

నీలాంటి బుల్లబ్బాయ్ లను చాలా మందిని చూశాం
హైదరాబాద్ భాషలో చెప్పాలంటే నీలాంటి వాటిని బుల్లబ్బాయి అంటామని, నీలాంటి బుల్లబ్బాయిలను చిట్టి నాయుళ్ళను చాలామందిని చూశామని అయితే తమకేం ఫరక్ పడేది లేదంటూ వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజులు పైశాచికానందం పొందుతావేమో కానీ తమ వెంట్రుక కూడా పీకలేవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డికి సాలిడ్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్
ముఖ్యమంత్రి పదవి వచ్చిందని తానేదో పెద్దవాడిని అయ్యానని ఎగిరెగిరి పడుతున్నావని మండిపడిన కేటీఆర్ రేవంత్ రెడ్డి అధికారం ఎవరికి శాశ్వతం కాదని హెచ్చరించారు మీ దుష్ట సాంప్రదాయం నువ్వు పదవిలో నుంచి దిగిపోయాక నిన్ను వెంటాడుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చిట్టి నాయుడు గా కేటీఆర్ అభివర్ణించడం ఆఫ్ట్రాల్ అంటూ తీసి పారేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+