బీఆర్ఎస్‌ విలీనంపై తేల్చేసిన కేటీఆర్

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన సంచలన వ్యాఖ్యలు, బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుంది. తాము ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కరోనా సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను తాము ఆపలేదని గుర్తుచేసిన కేటీఆర్, ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

KTR responds for the first time on BRS merger with BJP

రాష్ట్రంలో ఎరువుల కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది. పాలు ఇచ్చే బర్రెను పక్కకు పెట్టి దున్నపోతును తెచ్చుకున్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాక తమ కష్టాలు తీరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ విలీనంపై వస్తున్న వార్తలను ఖండిస్తూ, తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ ఎప్పటికీ తెలంగాణ కోసమే పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+