అది మా వైఫల్యమే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో మూడు పార్టీలకు తాము గెలిచే సీట్ల పైన క్లారిటీ వచ్చింది. మెజార్టీ సీట్లు సాధిస్తామని పైకి మాత్రం ధీమాగా చెబుతున్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తమ వైఫల్యం గురించి వివరించారు.

అందుకే ఓడాం
తెలంగాణలో రంగ‌ల్ - న‌ల్ల‌గొండ - ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్దికి మద్దతుగా కేటీఆర్ ప్రచారం చేసారు. అందులో భాగంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తమ ప్ర‌భుత్వ హ‌యాంలో చేసిన మంచి ప‌నులు చెప్పుకోలేక.. స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. 2 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ల్పించి కూడా యువ‌త‌కు దూర‌మ‌య్యాం. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు పెంచి కూడా వారికి దూర‌మ‌య్యాం. ఇలా చేసింది చెప్పుకోలేక ఓడిపోయామ‌న్నారు కేటీఆర్. పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మద్దతుగా నిలవాలని కోరారు.

KTR reveals the reasons for BRS defeat in the elections targets CM Revanth

నమ్మారు - మోసపోయారు
ఈ ఎన్నిక‌ల‌తో ఫ‌లితంలో ప్ర‌భుత్వం కూలిపోయేది లేదు... తారు మార అయ్యేది లేదని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ తో సహా తమ పార్టీ నేతలు మోస‌పోకండి.. గోస‌ప‌డుతామ‌ని చెప్పామని గుర్తు చేసారు. ప్రజలు కాంగ్రెస్ వాగ్ధానాలు నమ్మి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారన్నారు. ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. చ‌దువుకున్న విద్యావంతులు కాంగ్రెస్ పాల‌న గురించి ఆలోచించాల‌ని కోరారు. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయం ప‌రిస్థితి ఏంటో ఆలోచించాలని సూచించారు. ఎన్నిక‌ల‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంద‌మైన నినాదాలు ఎక్క‌డున్నాయో ఆలోచించాలన్నారు.

ఆలోచన చేయండి
తనకు ఓటు వేస్తే 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ ద‌స్త్రంపై డిసెంబ‌ర్ 9న తొలి సంత‌కం చేస్తాన‌ని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడరని కేటీఆర్ గుర్తు చేసారు. అర్జంట్‌గా బ్యాంక్‌కు వెళ్లి 2 ల‌క్ష‌ల రుణం తెచ్చుకోవాల‌ని కూడా సూచించారన్నారు. ఆరు నెల‌లు గ‌డిచిపోత‌ుందని ఎద్దేవా చేసారు. తొలిరోజే సంత‌కం చేస్తాన‌ని మోసం చేసిన రేవంత్ రెడ్డి నిల‌బెట్టిన అభ్య‌ర్థి ప‌ట్ల ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలో ఆలోచించాల‌ని కేటీఆర్ కోరారు.రైతు భ‌రోసా 15 వేలు ఇస్తా.. భూయ‌జ‌మాలకు కాదు కౌలు రైతుల‌కు కూడా రైతుభ‌రోసా ఇస్తాన‌ని రేవంత్ చెప్పి మోసం చేసారని కేటీఆర్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+