వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక లీవ్!: ఆలస్యంగా వచ్చారని కేటీఆర్ సీరియస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KTR serious on employees
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు కోపమొచ్చింది. సచివాలయంలోని డీ బ్లాకులో గురువారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు విధులకు ఆలస్యంగా వచ్చారు.

దీనిని గుర్తించిన ఆయన వారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు, మందలించారు. ఇలాంటివి మరోసారి జరిగితే ఊరుకోమని, కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉద్యోగులు ఆలస్యంగా వస్తే హాఫ్ డే లీవ్ వేయాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉద్యోగులు వివరణ ఇవ్వాలన్నారు.

కాగా, రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలోని టీకేఆర్‌ కళాశాల ఆవరణలో నిన్న కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరైన భారీ బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్‌లు టీఆర్ఎస్ పార్టీ తీర్ధం తీసుకున్నారు. అయితే, వీరితో పాటు ఆ పార్టీలో చేర్సాల్సిన మరో టీడీపీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఈ సభకు హాజరుకాలేదు.

దీంతో, ఆయన తెరాసలో చేరుతున్నారా? లేదా? అనే అనుమానాలు రాజకీయవర్గాల్లో మళ్లీ మొదలయ్యాయి. అయితే, ఆయన సొంత జిల్లా వరంగల్‌లో లేదా తన నియోజకవర్గం పరకాలలో ప్రత్యేకంగా ఓ భారీ సభను కేసీఆర్ సమక్షంలో నిర్వహించి, ఆ సభలో తన అనుచరులతో పాటు కారు ఎక్కాలని భావిస్తున్నారు. మరోవైపు, తెరాసలో చేరిన తలసాని త్వరలో తన నియోజకవర్గంలో భారీ సభను నిర్వహించనున్నారు.

కార్తీకమాసం వనభోజన ప్యాకేజీలు

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ టూరిజం కార్పోరేషన్‌ వనభోజనాల ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి వారంతం రోజున హైదరాబాదు నుంచి అనంతగిరి, పోచంపల్లి ప్రాంతాల సందర్శనకు ఒకరోజు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ లను అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 9గంటలకు ప్రారంభమయ్యే యాత్ర సాయంత్రం 6గంటలతో ముగుస్తుంది. అనంతగిరి బస్సు సికింద్రాబాద్‌లోని యా త్రినివాస్‌ నుంచి, పోచంపలి బస్సు బషీర్‌బాగు నుంచి బయల్దేరుతాయి.

English summary
Telangana state minister KTR serious on employees, who came late.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X