రేవంత్ పాలనపై అక్కసు: ఆర్నెల్లు కూడా ఆగలేకపోతున్న కేటీఆర్!!
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మొదలు పెట్టింది.ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగించేందుకు చేసుకోవలసిన సర్దుబాట్ల నేపథ్యంలో తాము ఆరు నెలల వరకు వేచి చూస్తామని, మౌనంగా ఉంటామని ఆ తర్వాత పాలన సాగించకపోతే ప్రశ్నిస్తామని కేటీఆర్ మీడియా ముఖంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టిన కేటీఆర్ అప్పుడే అక్కసు వెళ్లగక్కుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ పాలన మొదలుపెట్టిన తొలినాళ్లలోనే అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారంటూ, ఎలా వాటిని అమలు చేస్తారో చూస్తానంటూ కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు ఎన్నికల సమయంలో రేవంత్ చెప్పిన ప్రతి మాటకు రికార్డు ఉందని, ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, రాగానే పెన్షన్ 4000 ఇస్తామని చెప్పారని, పది రోజులు ఆగండి 15000 రైతు భరోసా ఇస్తామన్నారని కానీ ఇంతవరకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మొదటి క్యాబినెట్లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు ఏమైంది అని ప్రశ్నించిన కేటీఆర్, ఇలా అనేక అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి పాలనను ప్రశ్నిస్తున్నారు.
అప్పుడే తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి మొదలుపెట్టిన కేటీఆర్ కనీసం ఆరు నెలలు కాదు ఆరు వారాలు కూడా ఆగలేకపోయారు అన్న చర్చ తెలంగాణ సమాజంలో జోరుగా సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర పాలన పై రేవంత్ రెడ్డి అనుకున్నది ఒకటైతే గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. ఏ శాఖలో చూసిన అప్పుల కుప్పలు కనిపిస్తూ ఉండడంతో దిక్కుతోచని స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది.
అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలకు కట్టుబడి శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక తాజా కేటీఆర్ వ్యాఖ్యలు విన్నవారు రేవంత్ పాలనను ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారని అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని, అధికారం చేపట్టి కనీసం వారం రోజులు కూడా కాకుండానే అప్పుడే విమర్శలు మొదలుపెట్టారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications