వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ - మోడీ: ఇలాంటి షాక్‌లు తప్పవేమో.. నాటి ఫోటోలు పెట్టిన కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా ఎన్నికల ఫలితాలలో డొనాల్డ్ ట్రంప్ ప్రభంజనంలో కీలక పాత్రధారి, ట్రంప్ సహచరుడు, కాబోయే ఉపాధ్యక్షులు మైక్ పెన్స్ అపాయింటుమెంట్ ఇక మీద దొరకడం కష్టం. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆయనతో కలిసి గతంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

మంత్రి కేటీఆరా్ ఈ ఏడాది మే చివరి వారంలో అమెరికాలో పర్యటించారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తూ పలు రాష్ట్రాలలో పర్యటించారు. ఇందులో భాగంగా మే 25వ తేదీన ఇండియానా గవర్నర్ మైక్ ఫెన్స్‌ను కలిశారు.

kt rama rao

అప్పటికే ఆయన రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఖరారయ్యారు. ఇండియానా రాష్ట్ర రాజధాని ఇండియానా పోలీస్, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాలను అనుసంధానం చేసే సిస్టర్ సిటీస్ కమ్యూనిటీలో భాగంగా కీలక అంశాలపై ఇరువురు చర్చించారు.

నాటి సమావేశానికి సంబంధించిన ఫోటోలను కేటీఆర్ బుధవారం నాటు తన ట్విట్టర్ అకౌంటులో రీపోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. అమెరికాలో ట్రంప్ గెలుపు, భారత్‌లో ప్రధాని మోడీ సంచలన నిర్ణయం అందరిన ఆశ్చర్యపరిచిందని, ఇక ముందు కూడా ఇలాంటి స్వీట్ షాక్‌లు తప్పక చూడాల్సి వస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

https://twitter.com/KTRTRS/status/796274445946011648

English summary
'The world has become so much more exciting in last several hours. Trump's triumph & Modi's surprise move!! More excitement ahead I am sure..' KTR in twitter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X